Monday, December 3, 2018

వలచిన మనసే ఆలయం

చిత్రం : కలెక్టర్ జానకి (1972)
సంగీతం : వి. కుమార్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  సుశీల, 



పల్లవి :


వలచిన మనసే ఆలయం... అది ఒకే దేవునికి నిలయం
ఆ దేవుని అలరించు దారులు రెండు
ఒకటి అనురాగం...  ఒకటి ఆరాధనం


నీ వన్నది ..
నీ వన్నది నీ వనుకున్నది... నే నన్నది ఇలలో వున్నది
నీ వన్నది నీ వనుకున్నది... నే నన్నది ఇలలో వున్నది
నీ మదిలో మెదిలే స్వప్నమది...
నీ మదిలో మెదిలే స్వప్నమది... స్వప్నంకాదు... సత్యమిది
మాయని జీవిత సత్యమిది


నీ వన్నది నీ వనుకున్నది... 


చరణం 1 :


ఒక హృదయంలో నివసించేది... ఒకే ప్రేమికుడు కాదా
ఒక హృదయంలో నివసించేది... ఒకే ప్రేమికుడు కాదా


ఆ ప్రేమికుని మనసార చూసే...
ఆ ప్రేమికుని మనసార చూసే... కన్నులు రెండు కాదా


శ్రీనివాసుని ఎదపై నిలిచేది
శ్రీనివాసుని ఎదపై నిలిచేది... శ్రీలక్ష్మియే కాదా


అలివేలుమంగ దూరానవున్నా...
అలివేలుమంగ దూరానవున్నా... ఆతని సతియేకాదా.. ఆతని సతియేకాదా


నీ వన్నది నీ వనుకున్నది... నే నన్నది ఇలలో వున్నది
నీ వన్నది నీ వనుకున్నది... 



చరణం 2 :

బ్రతుకుదారిలో నడిచేవారికి గమ్యం ఒకటే కాదా
బ్రతుకుదారిలో నడిచేవారికి గమ్యం ఒకటే కాదా


పదిలంగా ఆ గమ్యం చేర్చే
పదిలంగా ఆ గమ్యం చేర్చే... పాదాలు రెండు కాదా


కృష్ణుని సేవలో
కృష్ణుని సేవలో... పరవశమొందిన రుక్మిణి నా ఆదర్శం


అతని ధ్యానమున అన్నీ మరచిన
అతని ధ్యానమున అన్నీ మరచిన... రాధయె నా ఆదర్శం
రాధయె నా ఆదర్శం



No comments:

Post a Comment