Wednesday, December 26, 2018

కొమ్మకో పండంటా

చిత్రం : ఘరానా గంగులు (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల





పల్లవి :


కొమ్మకో పండంటా... అహా..
రెమ్మకో పువ్వంటా... అహా...
ఏ చేతి చలువో ఈ పుణ్యమంతా..


కొమ్మకో పండంటా... హొయ్..హోయ్
రెమ్మకో పువ్వంటా... అహహ...
ఆ చేతి చలువే ఈ పున్నమంతా
ఆ చేతి చలువే ఈ పున్నమంతా


అహహా.. ఉ..హు...హు..



చరణం 1 :


కాసంత నవ్వితే కనకాంబరాలంట..
కూసింత నవ్వితే పుష్యరాగాలంట..


ఆ మాట నువ్వంటె నవ్వుకుందామంట..
మన జంట నవ్వులో తోట నవ్వాలంట..


తోటల్లె నవ్వాలి మనమిద్దరం..
తొలిసారి పండాలి మన జీవితం..
తొలిసారి పండాలి మన జీవితం..


హోయ్..కొమ్మకో పండంటా.. హహ.. రెమ్మకో పువ్వంటా..

ఆ చేతి చలువే ఈ పున్నమంతా....


కొమ్మకో పండంటా.. అహా.. రెమ్మకో పువ్వంటా..ఊహూ

ఏ చేతి చలువో ఈ పుణ్యమంతా..

ఏ చేతి చలువో ఈ పుణ్యమంతా..

అహహా... లలలాలా



చరణం 2 :



పనిపాటగా చేసి పాడుకోవాలంటా
పాటలోనే బ్రతుకు పండిపోవాలంటా


ప్రతి పువ్వులో మనసు పరిమళించాలంటా
పువ్వు రాలే వేళా తావి మిగలాలంటా


తొలిపూలూ తొడిగింది మన యవ్వనం
మలి పూతలడిగింది మన జీవితం
మలి పూతలడిగింది మన జీవితం


కొమ్మకో పండంటా.. హహ.. రెమ్మకో పువ్వంటా..
ఏ చేతి చలువో ఈ పుణ్యమంతా..


కొమ్మకో పండంటా.. అహా.. రెమ్మకో పువ్వంటా..ఊహూ
ఆ చేతి చలువే ఈ పున్నమంతా...
ఆ చేతి చలువే ఈ పున్నమంతా...


అహహా....



No comments:

Post a Comment