Wednesday, January 2, 2019

కాలం మారుతుందీ

చిత్రం :  కన్నతల్లి  (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల 

పల్లవి :

కాలం మారుతుందీ...  చేసిన గాయాలు మానుపుతుందీ 
విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ
కాలం మారుతుందీ...  చేసిన గాయాలు మానుపుతుందీ 
విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ

చరణం 1 :

పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాథను చేస్తుందీ
పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాథను చేస్తుందీ
ప్రాపులేసి పసితీగకు తానే పందిరి వేస్తుందీ
ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ   
            
కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    

చరణం 2 :

మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ
మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ
మనిషినిమాకును ఒకటిగచేసి కొట్టుకుపోతుందీ

కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ

చరణం 3 : 

ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ
ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ
ఎందరేగినా ఎన్నిజరిగినా ఎరగనట్టులే వుంటుందీ
ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ   

కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    

చరణం 4 :

కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ
కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ
కాలనిదో కన్నతల్లిదో గెలుపన్నదే తెలియనిదీ 
 
కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ 

No comments:

Post a Comment