Tuesday, January 8, 2019

పూవులు పూయును

చిత్రం : గురువును మించిన శిష్యుడు (1963)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : కృష్ణమూర్తి
నేపథ్య గానం :  జానకి

పల్లవి :

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పూవులు పూయును పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు
పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు

ప్రాణములున్నవి అందరికీ... ప్రణయము తెలిసేదెందరికి ..

చరణం 1 :

అరుదైన వరం మన జీవితమూ... ఆనందానికి అది అంకితమూ

అరచేతిన ఉన్నది...  స్వర్గమురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అరచేతిన ఉన్నది స్వర్గమురా... అది ఎరుగని వారిదే నరకమురా

పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు

చరణం 2 :

చేజారినదీ నిన్నటిదినమూ... జనియించనిదే రేపటి దినమూ

అవి అందనివీ... మనకెందుకురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అవి అందనివీ మనకెందుకురా... ఈ దినమే మనదనుకొందామురా

పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ... ప్రణయము తెలిసేదెందరికి ..
పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు

http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7066

No comments:

Post a Comment