Tuesday, June 4, 2019

సాగే అలలపైన

చిత్రం : జగన్మోహిని (1978)
సంగీతం : విజయకృష్ణమూర్తి
గీతరచయిత : 
సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల




పల్లవి :



సాగే అలలపైన... ఊగే చందమామ
సాగే అలలపైన... ఊగే చందమామ
మనసు కలువలో చూడు...  దాగున్నాడు ఈ చందమామ
మనసు కలువలో చూడు... దాగున్నాడు..ఈ చందమామ
సాగే అలలపైన... ఊగే చందమామ



చరణం 1 :


ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో
ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో
ఆ తడిసిన వెన్నెల ముడివేయించిన సడలని కౌగిలిలో... చలిలో
నులి వేడి కలలు కందామా

సాగే అలలపైన... ఊగే చందమామ



చరణం 2 :


వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో
వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో
ఆ ఉబికిన పొంగుల మాటున దాగని ఊహల అలజడిలో ... జడిలో
చెలరేగి..రేగి పోదామా


సాగే అలలపైన... ఊగే చందమామ
మనసు కలువలో చూడు...  దాగున్నాడు ఈ చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ


తందానే.. తందానేతందానే తందానేతందానేతందానే.. తందానేతందానే తందానేతందానే




2 comments: