Saturday, May 11, 2019

గోపాలా.. గానలోలా...

చిత్రం : బ్రతుకే ఒక పండుగ (1977)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  సుశీల

పల్లవి :

గోపాలా.. గానలోలా...
గొంతు గుండెకు దగ్గరున్నది... కళ్ళు మాత్రం దూరమైనవి
గొంతు గుండెకు దగ్గరున్నది... కళ్ళు మాత్రం దూరమైనవి
చూడలేనిది పాడగలను... పాటలో నిను చూడగలను

గోపాలా.. గానలోలా...
గొంతు గుండెకు దగ్గరున్నది... కళ్ళు మాత్రం దూరమైనవి
చూడలేనిది పాడగలను... పాటలో నిను చూడగలను
గోపాలా.. గానలోలా...

చరణం 1 :

నల్లనయ్యవు నీవని... చల్లనైనా దొరవని
నల్లనయ్యవు నీవని... చల్లనైనా దొరవని
ఎల్లరూ నిను పొగడుతుంటే... ఒళ్ళు పులకలు రేగెను
ఎల్లరూ నిను పొగడుతుంటే... ఒళ్ళు పులకలు రేగెను
నీ మేని వన్నె తెలియకున్నా.. లోన వెన్నను తెలుసుకున్నా

గోపాలా.. గానలోలా...
గొంతు గుండెకు దగ్గరున్నది... కళ్ళు మాత్రం దూరమైనవి
చూడలేనిది పాడగలను... పాటలో నిను చూడగలను
గోపాలా.. గానలోలా...

చరణం 2 :

కబోది కనులకు కలలు రావా... అనాధ మనసుకు ఆశలుండవా
కబోది కనులకు కలలు రావా... అనాధ మనసుకు ఆశలుండవా
వెదురు ముక్కకు మధురమైనా రాగములను నేర్పు స్వామీ
వెదురు ముక్కకు మధురమైనా రాగములను నేర్పు స్వామీ
జాలితో నను చూడలేవా... నీ చూపులో నను నిలువనీవా

గోపాలా.. గానలోలా...
గొంతు గుండెకు దగ్గరున్నది... కళ్ళు మాత్రం దూరమైనవి
చూడలేనిది పాడగలను... పాటలో నిను చూడగలను
గోపాలా.. గానలోలా... 

No comments:

Post a Comment