Friday, January 24, 2020

పకపక రాగం

చిత్రం :  అంకురం (1993)
సంగీతం :  హంసలేఖ
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం : బాలు


పల్లవి :


పకపక రాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మా
తికమక తాళం కొట్టిందమ్మో పువ్వులకొమ్మా
అత్తారింటికి రైలెక్కింది రబ్బరు బొమ్మ
సంతోషంతో చక్కిలి పండే చక్కరబొమ్మ

నిన్నోమొన్నో లగ్గమ ఏమో...మొగుడెవరంటే మొగ్గయ్యింది
రేపో మాపో పాపో బాబో.. అవునా అంటే ఛీఫో అంది
అపుడేవద్దు ఆగండింకా ఐదారేళ్ళు
అసలేవద్దు ఒక్కరి వెనుక పిలగాళ్ళు


చరణం 1 :


అమ్మా.. బొమ్మకు పట్టుచీరా సారే పెట్టి బొంబాయి పంపాలా
ముద్దొస్తొన్న బొమ్మ ముఖం చూడమ్మో
బాగుంది సంబడం... బొమ్మలాంటి పిల్లకు పెళ్ళి చెయ్యలేక చస్తుంటే
నీ బొమ్మపెళ్ళికి పేరంటమా?


చిచ్చుల్లో పడకురా జీవా... పెళ్ళి ఉచ్చులో పడకుర జీవా
చిచ్చుల్లో పడకురా జీవా... పెళ్ళి ఉచ్చులో పడకుర జీవా
ఇల్లని ఆలని ఆశపడతావా... రైలుపెట్టికి సాటి ఏదిర జీవా
పెళ్ళిపేరంటాలని లంటాలు ఎందుకు... ప్లాటు ఫారం మీదా హాయిగ బ్రతుకు



చరణం 2 :


ఏది బిడ్డా ఓ బీడి ఇలా పారేయ్...
టికెట్ టికెట్... ఒరేయ్ బైరాగి.. లే...
ఇది నీ బాబుగారి గుర్రబడ్డి కాదు
తన్నిపెట్టుకొని సీట్లో బైఠాయించడానికి
ఫో... ఆ కక్కసు దగ్గర ఏడ్వరా...


కసరుకోకు బిడ్డా.. కాషాయం చూసైనా కాస్త కనికరించు
సీతంబాకు చేయిస్తి చింతాకు పతాకాము రామచంద్రా
ఆ పతాకామున పట్టే పదివేల వరాహాలు రామచంద్రా
అయ్యా.. సరస్వతిని చిత్రీకపట్టకండి...
పతాకాలు.. వరాహాలు ఏంటయ్యా.. నా బొందా


రాణి రాణీ రావే నా రవ్వల బాణీ
రంగూరంగుల వోణీ దొరసానలివేణి
రాణి రాణీ రావే నా రవ్వల బాణీ
రంగూరంగుల వోణీ దొరసానలివేణి
జాకుపాటులో లైఫు కార్డు వై డీలు చేయవే రాణీ
రాణి రాణీ రావే నా రవ్వల బాణీ
షో...


పకపక రాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మా
తికమక తాళం కొట్టిందమ్మో పువ్వులకొమ్మా
అత్తారింటికి రైలెక్కింది రబ్బరు బొమ్మ
సంతోషంతో చక్కిలి పండే చక్కరబొమ్మ

No comments:

Post a Comment