Wednesday, January 22, 2020

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు

చిత్రం :  అంకురం (1993)
సంగీతం :  హంసలేఖ
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం : బాలు, చిత్ర  


పల్లవి :


ఎవరో ఒకరు...  ఎపుడో అపుడు..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా...  అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..

అ... అ... అ... అ... అ
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది


ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..


చరణం 1 :

కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా... అనుకొని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే... మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే
వాన ధార రాదుగా నేల దారికి... ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి


ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..


చరణం 2 :

చెదరకపోదుగా చిక్కని చీకటి... మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి
దానికి లెక్క లేదు కాళరాతిరి
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని... రెప్ప వెనక ఆపని కంటి నీటిని
సాగలేక ఆగితే దారి తరుగునా... జాలి చూపి తీరమే దరికి చేరునా

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు..










No comments:

Post a Comment