చిత్రం : అంకుల్ (2000) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ గీతరచయిత : సిరివెన్నెల నేపథ్య గానం : బాలు
పల్లవి :
ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓ వరం ఆడే పాడే పాపగా గడపాలనుంది జీవితం ఏ దైవం ఇస్తాడో ఆ వరం ఏ దీపం చూపేనో ఆ వరం వెదికి వెదికి వేసారినా
ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓ వరం
చరణం 1 :
వెలుగెందుకు చదువెందుకు కలిమెందుకు బలిమెందుకు... పసితనమును కరిగిస్తోంటే పాపాయులుగా పుట్టి... పాపాలుగా మారే పయణం పేరా పెరగడమంటే తిరిగిరాని ఆ పెన్నిధి... ఏ సంపదా కొనలేనిది చేజారిన నా బాల్యమే వస్తానంటే... ఇన్నాళ్లుగా నన్నల్లిన కాలానిట్టే వదిలి తనతో వెళ్ళాలని...
ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓ వరం ఆడే పాడే పాపగా గడపాలనుంది జీవితం
చరణం 2 :
చినుకమ్మ పడవాటలు.. చిలుకమ్మకు పొడిమాటలు నేర్పించే చిన్నారులతో... చిగురమ్మకు విరిపూతలు... వెలుగమ్మకు తొలి జోతలు అనిపించే చిరునవ్వులతో ప్రతి క్షణం సంతోషమే... ప్రతిస్వరం సంగీతమే
దివి జాబిలి దిగలేదని చిరుకోపానా తియతీయగ ఉంటుంది కన్నీరైనా అలకా సొగసే ఆ ప్రాయానా...
ఎన్నో ఎన్నో ఏళ్ళుగా అడగాలనుంది ఓ వరం ఆడే పాడె పాపగా గడపాలనుంది జీవితం ఏ దైవం ఇస్తాడో ఆ వరం ఏ దీపం చూపేనో ఆ వరం వెదికి వెదికి వేసారినా
No comments:
Post a Comment