Saturday, January 25, 2020

కళ్ళముందు చీకటుంటే

చిత్రం :  అంకుల్ (2000)
సంగీతం :  వందేమాతరం శ్రీనివాస్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య  గానం :  బాలు 


పల్లవి :


కళ్ళముందు చీకటుంటే కలత దేనికి
మిణుగురంత ఆశ చాలు నడపడానికి
కంటి నీట కరగిపోని కలలకాంతి చూపుతొన్న దోవలోనె సాగిపో...సాగిపో... 

ప్రయాణమా.. నువు అలసిపొని అడుగులేసి అందుకోనిదే
తనంత తాను తీరమేది నిన్ను చేరదే


కళ్ళముందు చీకటుంటే కలత దేనికి
మిణుగురంత ఆశ చాలు నడపడానికి



చరణం 1 :


చల్లని ఆ చందమామ గుండెలోతులో
నల్లని ఆ మచ్చ నీది ఎందుకున్నదో
కానరాని కారుచిచ్చు అంచుతున్నదో
పెనుమంటల మరిగి మనసు ముడుచుకున్నదో
ఏకాకి గుండె కోత ఏమిటందో..
పైపైన వెండిపూత ఎందుకుందో..
రహస్యమంటు తేలునా...


నిశీధిలో... ఓ..ఓ..ఓ..
నిదురమాని మేలుకున్న బేల హృదయమా..
నిజాలు ఏవో నీడలేవో నీకు తెలుసునా


కళ్ళముందు చీకటుంటే కలత దేనికి
మిణుగురంత ఆశ చాలు నడపడానికి


చరణం 2 :


ఏ పున్నమి వెన్నెల నీది కాదయా
అనుబంధం పై ఆశలు పెంచుకోకయా
లోకానికి కానుకగా ఇచ్చిపోవయా
ఆకశాన ఒంటరిగా నిలిచిపోవయా


నువు కన్న వెలుగు పాప ఏవయ్యిందో
నీ కంట పడక తాను ఎక్కడుందో
ఎవరిని అడుగుతావయా... 

ఓ చంద్రమా... ఓ..ఓ..
ప్రతీ చిన్నారి లేతనవ్వులోన చూడయా
నీ వెన్నెల పారాడుతోంది పోల్చుకోవయా


కళ్ళముందు చీకటుంటే కలత దేనికి
మిణుగురంత ఆశ చాలు నడపడానికి
కంటి నీట కరగిపోని కలలకాంతి చూపుతొన్న దోవలోనె సాగిపో...సాగిపో... 

ప్రయాణమా.. నువు అలసిపొని అడుగులేసి అందుకోనిదే
తనంత తాను తీరమేది నిన్ను చేరదే


చరణం 3 :


ఎదమాటున మంటలున్న చందమామవి
సిరివెన్నెల పంచుతున్న చెలిమి సీమవి
ఏ అనుబంధాలు లేని ఒంటివాడివి
ఈలోకం అంతా నాదన్న వాడివి


మాకోసమైన  నువు తిరిగి రావా
మా గుండె వేదనంతా తీర్చలేవా
మాతోటి మళ్ళీ గడపవా
నువు లేనిదే..ఏ..ఏ..
ఈ శూన్యమొకటి మాకు నుదుట రాసియుండును
మా కంటి వెలుగు మాకు మటుకు అంధకారము


కళ్ళముందు చీకటుంటే కలత దేనికి
మిణుగురంత ఆశ చాలు నడపడానికి
కంటి నీట కరగిపోని కలలకాంతి చూపుతొన్న దోవలోనె సాగిపో...సాగిపో... 

ప్రయాణమా.. నువు అలసిపొని అడుగులేసి అందుకోనిదే
తనంత తాను తీరమేది నిన్ను చేరదే


No comments:

Post a Comment