Friday, February 14, 2020

హీరోలే... అందరూ హీరోలే

చిత్రం :  అందరూ హీరోలే (1998)
సంగీతం : శ్రీ
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు
 



పల్లవి : 


హీరోలే... హీరోలే... అందరూ హీరోలే 

యయయయయ యాయాయాజీరోలే ఉండరులే... 

జనాలందరూ హీరోలే

యయయయయ యాయాయా

ఏమోలే డవుటేలే... యయయయయ యాయాయా

అనుకుంటే అది మామూలే... యయయయయ యాయాయా

ఏమోలే డవుటేలే... అనుకుంటే అది మామూలే

నిజమో కాదో తేలాలంటే లైఫును డీపుగ చూడాలేఏ..ఏ...ఏ...


హీరోలే... హీరోలే... అందరూ హీరోలే యయయయయ యాయాయా


చరణం 1 :


బైకు మీదా ఒక బేబీ వచ్చి ఫలాన యడ్రస్ ఏదంటే
నాకు తెలుసునని బాక్ సీటులో బైఠాయించే వీలుంటే
అలాంటి చాన్సుని పొందేవాడు బక్క పీనుగే అయితేనే
ఏ..ఏ..ఏం.... ఆ ఒక్కసారికి హీరోలే


చిన్న సెటప్పుతో సినిమాకెళ్ళి మహా ఠీవిగా కూర్చుంటే

పక్క సీట్లో తన ఇల్లాలే అదో మాదిరిగ చూస్తుంటే

ఠక్కున ఏవో కథలల్లేసి సముదాయించే మొనగాళ్ళే...ఏ..ఏ..ఏ... డూపు అక్కర్లేనీ హీరోలే


హీరోలే... హీరోలే... అందరూ హీరోలే
యయయయయ యాయాయా


చరణం 2 :


బాసుగాడితో బూతులు తిన్నా... ఫేసు మీద అది కనపడకుండా
స్వీటు స్మైలుతో సీటుని చేరే.. టెక్నిక్ తెలిసిన ఆర్టిస్ట్లే
మేక్ అప్ ఎరుగని మహానటుల మన మధ్యన అందరు హీరోలే... ఏ..ఏ..


చిరను చుట్టిన రాటను చూసి మహా స్టైల్ గ బీటుని వేసి
బట్ట తలను పది సార్లు దువ్వే పోకిరి ఫోసులను కొడుతుంటే
యమా రొమాంటిక్ మూడులో ఆ ముసలి మన్మధులు హీరోలే... ఏ..ఏ..
ఏ..ఏ...ఏ...


హీరోలే... హీరోలే... అందరూ హీరోలే
యయయయయ యాయాయా


చరణం 3 :


చెడామడా తెగ తాగి చెడే ప్రతివాడు ట్రాజిడి హీరోలే
అవకతవక పనులెన్నో చేసే చవట కామెడి హీరోలే
బస్సు నెత్తి మీదెక్కి ట్రావెల్  చేసే టాప్ హీరోలే
పరాకుగ నడుస్తూ పదే పదే పడిపోతే ఫ్లాప్ హీరోలే


బాక్ బెంచి వీకు బాచ్ లో సున్నా మార్కుల స్టూడెంట్లే
కబడిలోనూ కోకోలోనూ కప్పులు తెస్తే హీరోలే
బ్రహ్మ కిట్టునువు చదవగలిగితే అందరూ హీరోలే


హీరోలే... హీరోలే... అందరూ హీరోలే
యయయయయ యాయాయా
జీరోలే ఉండరులే... జనాలందరూ హీరోలే
యయయయయ యాయాయా
ఏమోలే డవుటేలే... యయయయయ యాయాయా
అనుకుంటే అది మామూలే... యయయయయ యాయాయా
ఏమోలే డవుటేలే... అనుకుంటే అది మామూలే
నిజమో కాదో తేలాలంటే లైఫును డీపుగ చూడాలే
ఏ..ఏ...ఏ...


No comments:

Post a Comment