చిత్రం : అందాల రాశి (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ
పల్లవి :
అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయసి... ప్రేయసి

అందాలరాశి...
చరణం 1 :
నీ రూపు హృదయాలయ దీపికా... నీ చూపు ఉదయోదయ తారకా

నీ పలుకుల సడికి ఉలికిపడే ఊర్వశినై ఊగనీ
నీ మేను తగిలి మెలిక తిరిగి మేనకనై ఆడనీ
ఆ.. నీవే నా జీవన బృందావన రాధికా
నీవే యువతీ జన నవమోహన గీతికా
అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయసి... ప్రేయసి
చరణం 2 :
నీ మాట మంత్రాక్షర మాలికా... నీ మనసే మమతల మరుమల్లికా

పురివిప్పిన నీ సొగసున మణిపురినే చూడనీ
గురి తప్పని నీ అడుగులు కూచిపూడి ఆడనీ
నీవేలే శ్రీశైల శిఖరాంచల చంద్రికా
నీవే నా నవయవ్వన నందనవన భ్రమరికా
No comments:
Post a Comment