Showing posts with label మరో సీత కథ (1979). Show all posts
Showing posts with label మరో సీత కథ (1979). Show all posts
Wednesday, July 22, 2020
మసకమసక చీకట్లో
చిత్రం : మరో సీత కథ (1979)
మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
సగం చీకటి సగం వెలుతురు.. సగం అందితే సగం అందదు
నీ చూపులు నీ కైపులు నాకోసమేరా
సగం రేయిలో జగం సోలితే సుఖం వున్నది ఖుషీ వున్నది
అరె రా నిశి రాత్రికే నీదాన్నిరా
ఎందరు ఏడ్చిన ఏడుపులో
చిత్రం : మరో సీత కథ (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు
పల్లవి :
ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణా గోదావరి
ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణా గోదావరి
ఎందరి ఆరని కన్నీళ్లో అంతులేని కడలి... అంతులేని కడలి
ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణా గోదావరి
చరణం 1 :
కడుపూరు నుంచి కాడూరుకు బదిలి
మాయదారిలో ఇది మూడునాళ్ల మజిలీ
కడుపూరు నుంచి కాడూరుకు బదిలి
మాయదారిలో ఇది మూడునాళ్ల మజిలీ
ఎండమావిలో ఈదులాటరా
చావుబ్రతుకుల పెనుగులాటరా
ఎంత ఈదినా అంతేది
చావే చివరకిమిగిలేది... బ్రతుకే చితిగా రగిలేది
ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణా గోదావరి
ఎందరి ఆరని కన్నీళ్లో అంతులేని కడలి... అంతులేని కడలి
చరణం 2 :
గుడిలోని గంటా చితిలోని మంటా
విన్నవాడు రాడు ఇక కన్న తోడులేదు
గుడిలోని గంటా చితిలోని మంటా
విన్నవాడు రాడు ఇక కన్న తోడులేదు
రాతిబొమ్మలో రాముడేడిరా
పూలకొమ్మలు పుడకలవునురా
ఏడుజన్మల ఏడుపునే కోటినదులుగా మారేది... జీవనదులుగా మిగిలేది
ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణా గోదావరి
ఎందరి ఆరని కన్నీళ్లో అంతులేని కడలి... అంతులేని కడలి
ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణా గోదావరి
కోటిరాగాలలో వేయి దైవాలలో
చిత్రం : మరో సీత కథ (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ
పల్లవి :
కోటిరాగాలలో... వేయి దైవాలలో
హృదయాన నిలిచేది ఒక దైవమే
మనసారా పలికేది ఒక రాగమే ... అనురాగమే
కోటి అందాలలో... వేయి బంధాలలో
హృదయాన నిలిచేది నీ అందమే
మనసారా కోరెది ఒక బంధమే... అనుబంధమే
చరణం 1 :
చిరుగాలి కెరటాలు సిరిమల్లె గంధాలు
తెలిపేను నా రాణి వచ్చేనని
చిరుగాలి కెరటాలు సిరిమల్లె గంధాలు
తెలిపేను నా రాణి వచ్చేనని
మేఘాల దాహాలు సెలయేటి దేహాలు
తెలిపేను విరహాన వేగేవని... విరహాన వేగెవని
కోటి అందాలలో వేయి బంధాలలో
హృదయాన నిలిచేది నీ అందమే
మనసారా కోరెది ఒక బంధమే... అనుబంధమే
చరణం 2 :
నీపైట కొంగే తెరచాప కాగా
రాగాల సాగాలి నా ప్రేమనౌక
నీపైట కొంగే తెరచాప కాగా
రాగాల సాగాలి నా ప్రేమనౌక
నీ వాలుచూపే చుక్కాని కాగా
చేరాలి శృంగార తీరాలిక... శృంగార తీరాలిక
కోటి అందాలలో వేయి బంధాలలో
హృదయాన నిలిచేది నీ అందమే
మనసారా కోరెది ఒక బంధమే... అనుబంధమే
కోటిరాగాలలో వేయి దైవాలలో
హృదయాన నిలిచేది ఒక దైవమే
మనసారా పలికేది ఒక రాగమే... అనురాగమే
Labels:
(మ),
Murali mohan,
చక్రవర్తి,
బాలు,
మరో సీత కథ (1979),
వేటూరి,
శైలజ
ఊరు పాడాలి
చిత్రం : మరో సీత కథ (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : జి. ఆనంద్
పల్లవి :
ఓహో..హో.. ఓ.. ఓ.. ఓ..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఊరు పాడాలి సెలయేరు పాడాలి
ఊరు పాడాలి సెలయేరు పాడాలి
పాపలేని కంటికది జోల కావాలి... మా జోలె నిండాలి
చరణం 1 :
పల్లెపదంలా పచ్చగా జానపదంలా వెచ్చగా
పల్లెసీమలే పండగా... నేపాట పాడాలి
పల్లెపదంలా పచ్చగా జానపదంలా వెచ్చగా
పల్లెసీమలే పండగా... నేపాట పాడాలి
చల్లని తల్లులు పిల్లలు పాపలు
చల్లని తల్లులు పిల్లలు పాపలు
చీకటికంటికి వెన్నెలలై వెయ్యేళ్లు బతకాలి... కన్నీళ్లు తుడవాలి
ఊరు పాడాలి సెలయేరు పాడాలి
పాపలేని కంటికది జోల కావాలి... మా జోలె నిండాలి
చరణం 2 :
మనసే చూసే కన్నుగా చూడనే కన్నే పాటగా
పాడని పాటే లేదులే చూడని వెలుగే లేదులే
మనసే చూసే కన్నుగా చూడనే కన్నే పాటగా
పాడని పాటే లేదులే చూడని వెలుగే లేదులే
కోదండరాముడి కోవెల నేనై
కోదండరాముడి కోవెల నేనై
దేవుడిగుడిలో దీపం నాలో పాటపాడాలి... ఈపూట గడవాలి
ఊరు పాడాలి సెలయేరు పాడాలి
పాపలేని కంటికది జోల కావాలి... మా జోలె నిండాలి
ఊరు పాడాలి సెలయేరు పాడాలి
పాపలేని కంటికది జోల కావాలి... మా జోలె నిండాలి
Subscribe to:
Posts (Atom)