చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : ఏసుదాస్, సుజాత
పల్లవి :
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం

పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా

చరణం 1 :
ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసినదా ద్వేషము
కథ మారదా... ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే

అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
చరణం 2 :
విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా... ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే

పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
సాహిత్యం భువనచంద్ర గారు అనుకుంటాను అండి. సరిచూడగలరు.
ReplyDelete