చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
ఆ మాటే చాలు నెలవంకా రా ఇక
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక
విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా
కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా
మరో నవ్వు రువ్వరాదటే....
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
చరణం 1 :
మల్లెపూల మంచమేసి హుషారించనా
జమాయించి జాజి మొగ్గ నిషా చూడనా
తెల్ల చీర టెక్కులేవో చలాయించనా
విర్రవీగు కుర్రవాణ్ణి నిఘాయించనా
అతివకు ఆత్రము తగదటగా...
తుంటరి చేతులు విడువవుగా మనసు పడే పడుచు ఒడి...
ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
చరణం 2 :
కోర మీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జామపళ్ళ రుచే చూపనా
కొంగు చాటు హంగులన్నీ పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా
పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా.... తదిగిణతోం మొదలెడదాం...
ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశామరో నవ్వు రువ్వరాదటే....
ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ఆ మాటే చాలు నెలవంకా రా ఇక
No comments:
Post a Comment