Tuesday, August 25, 2020

నవ్వు వచ్చిందంటే కిలకిల

చిత్రం :  స్నేహం (1977)
సంగీతం :   కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  బాలు 



పల్లవి :


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల


గోదారి పాడింది గలగలా... ఆ.. ఆ..
గోదారి పాడింది గల గలా...
దానిమీద నీరెండ మిల మిల మిల 


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల



చరణం 1 :


నది నిండా నీళ్ళు ఉన్నా... మనకెంత ప్రాప్తమన్నా
నది నిండా నీళ్ళు ఉన్నా... మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్ళే... గరిటైతే గరిటెడు నీళ్ళే
కడవైతే కడివెడు నీళ్ళే... గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే... ఏ.. ఏ.. ఏ..
ఎవరెంత చేసుకుంటే... అంతే కాదా దక్కేది


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల..



చరణం 2 :


ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
ఆ.. అ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా


కొత్త మతం పుచ్చుకుంటే గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల


చరణం 3 :


తమ సొమ్ము సొమవారం ఒంటి పొద్దులుంటారు
మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
తమ సొమ్ము సొమవారం ఒంటి పొద్దులుంటారు
మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే... ఏ..ఏ...ఏ
పరులకింత పెట్టినదే...  పరలోకం పెట్టుబడి


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వల వల
గోదారి పాడింది గల గల
కథలెన్నో చెప్పింది ఇలా ఇలా


నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటే వలవల 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7231

No comments:

Post a Comment