చిత్రం : స్నేహం (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు
పల్లవి :
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
చరణం 1 :
ఎంత మబ్బు మూసినా... ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత మబ్బుమూసినా... ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత ఏడుపోచ్చినా... ఎంత గుండెనొచ్చినా
ఎంత ఏడుపోచ్చినా... ఎంత గుండెనొచ్చినా
నీలోపల ఉద్దేశం... ఒకలాగే ఉండాలి
నీలోపల ఉద్దేశం... ఒకలాగే ఉండాలి
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
చరణం 2 :
కష్టాలే కలకాలం... కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై... వస్తూ పోతుంటాయి
కష్టాలే కలకాలం... కాపురముంటాయి
సౌఖ్యాలు చుట్టాలై... వస్తూ పోతుంటాయి
వెళ్ళాలి బహుదూరం... మోయాలి పెనుభారం
వెళ్ళాలి బహుదూరం... మోయాలి పెనుభారం
ఏమైనా కానీరా..మన యాత్ర మానం
ఏమైనా కానీరా..మన యాత్ర మానం
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోయింది పొల్లు... మిగిలిందే చాలు
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
పోనీరా పోనీరా పోనీరా..ఆ..ఆ.. పోతే పోనీరా
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7295
No comments:
Post a Comment