చిత్రం : లవ్ ఇన్ సి౦గపూర్ (1980) సంగీతం : జె.వి. రాఘవులు గీతరచయిత : వేటూరి నేపథ్య గానం : జానకి, రామకృష్ణ
పల్లవి :
ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి నిన్నే రమ్మన్నవి ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే మనసే దోచావులే ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి నిన్నే రమ్మన్నవి ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూసానులే మనసే దోచావులే
లవ్ లవ్... లవ్ ఇన్ సింగపూర్ లవ్ లవ్... లవ్ ఇన్ సింగపూర్
చరణం 1 :
తియ్యని సుఖం... ఇక తెలియదు జగం తియ్యని సుఖం... ఇక తెలియదు జగం వయసు పొంగులే ఉన్నాయి... నన్ను అందుకోమని పిలిచాయి వయసు పొంగులే ఉన్నాయి... నన్ను అందుకోమని పిలిచాయి ఒంటిగా నేను కల గంటుంటే... కొంటెగా జంట చేరాను
ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి నిన్నే రమ్మన్నవి ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే మనసే దోచావులే
లవ్ లవ్... లవ్ ఇన్ సింగపూర్ లవ్ లవ్... లవ్ ఇన్ సింగపూర్
చరణం 2 :
ప్రేమే కలా... అది రంగుల వలా ప్రేమే కలా... అది రంగుల వలా పువ్వులోనే తేనుంటుంది... ఆ తేనెకోసమే తేటుంది పువ్వులోనే తేనుంటుంది... ఆ తేనెకోసమే తేటుంది పరిచయం మనకు కలిగిన నాడే... ప్రణయమే తలుపు తట్థింది
ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి నిన్నే రమ్మన్నవి ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే మనసే దోచావులే
లవ్ లవ్ లవ్ ఇన్ సింగపూర్ లవ్ లవ్ లవ్ ఇన్ సింగపూర్ లవ్ ఇన్ సింగపూర్... లవ్ ఇన్ సింగపూర్ లవ్ ఇన్ సింగపూర్... లవ్ ఇన్ సింగపూర్
No comments:
Post a Comment