చిత్రం : సత్యానికి సంకెళ్ళు (1974) సంగీతం : చక్రవర్తి గీతరచయిత : నేపథ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు ఆసరాగా నాకు దొరికావు... నా ఆశలన్నీ నిజం చేశావు
నీకూ నీవారు లేరు...
చరణం 1 :
ఆ... ఆ... ఆ... ఆ... దారిలోని గడ్డిపువ్వు నలిగిపోయే వేళ నువ్వు మల్లె పువ్వుగ మార్చి వేశావు.. నీ మనసులోనే దాచివేశాను
నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు
చరణం 2 :
రిక్షాకే రెక్కలొచ్చి నక్షత్ర యాత్ర చేస్తే... రిక్షాకే రెక్కలొచ్చి నక్షత్ర యాత్ర చేస్తే... పక్షులే మన పాట వింటాయి... మబ్బులే పరదాలు కడతాయి ఈ మబ్బులే పరదాలు కడతాయి
నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు
చరణం 3 :
ఆ... ఆ... ఆ... ఆ...
కప్పులేనీ ఇంటిలోనా గడప లేని పడక గదిలో కప్పులేనీ ఇంటిలోనా గడప లేని పడక గదిలో చందమామా తొంగి చూస్తాడు... అందమంతా ఒలకబోస్తాడు తన అందమంతా ఒలకబోస్తాడు
నీకూ నీవారు లేరు... నాకూ నా వారు లేరు ఆసరాగా నాకు దొరికావు... నా ఆశలన్నీ నిజం చేశావు నా ఆశలన్నీ నిజం చేశావు
No comments:
Post a Comment