Tuesday, September 1, 2020

మల్లియల్లో మా పల్లెసీమల్లో




చిత్రం : పంచభూతాలు (1979)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


మల్లియల్లో మా పల్లెసీమల్లో   
ఎన్నియల్లో మా పాడిపంటల్లో   
బంగారు పైరుల్లోనా సింగారం చిందేసింది


ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది 


మల్లియల్లో.... 


చరణం 1 :


మావిళ్ల తోటల్లో కోయళ్లే కూయంగా   
చిన్నారి గుండెల్లో కోరికలే పూయంగా   
మందారపువ్వల్లె అందాలే ఆడంగా
అందాలే ఆడంగా... అందాలే ఆడంగా


గోపాలకిష్టమ్మ గోవుల్లో పాడంగా   
గోపెమ్మా కన్నుల్లో ఎన్నెల్లే కాయంగా   
రాధమ్మ నవ్వుల్లో రతనాలే రాలంగా
రతనాలే రాలంగా... రతనాలే రాలంగా
రేపల్లెలో గోపాలుడు... మాపల్లెలో బలరాముడు


ప్రేమ త్యాగం కలిపి... దానం ధర్మం తెలిసి
ఆ దేముళ్లో రాముళ్లో నాగళ్లే పట్టంగా
నూరేళ్లు పండాలిరా... మాలోగిళ్లునిండాలిరా 



మల్లియల్లో మా పల్లెసీమల్లో   
ఎన్నియల్లో మా పాడిపంటల్లో   
బంగారు పైరుల్లోనా సింగారం చిందేసింది
ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది 



చరణం 2 :



సుక్కల్లో నెలవంక  తనవంకే చూస్తుంటే   
గోరొంక దూరంగా గూడెక్కి రమ్మంటే   
నీరెండ గుండెల్లో చలి కాచి పొమ్మంటే
చలి కాచి పొమ్మంటే... చలి కాచి పొమ్మంటే


మేడెక్కి గూడెక్కి రమ్మంటే వస్తుందా   
నోరిడిచి అడగందే అమ్మైనాపెడుతుందా   
చిలకమ్మ మనసెరిగి ముద్దిస్తే వద్దందా
ముద్దిస్తే వద్దందా... ముద్దిస్తే వద్దందా


పాలగువ్వలో మెరిసేదెల్లా
రాసెయ్యనా గుండె కోసియ్యనా
వయసు వలపు కలిపి... మనసుమమత తెలిపి
అందాల బంధాలు చిందేసి ఆడంగా
ఈడుజోడు కలవాలమ్మా... నీకు తోడునీడ కావాలమ్మా


మల్లియల్లో మా పల్లెసీమల్లో... మా పల్లెసీమల్లో   
ఎన్నియల్లో మా పాడిపంటల్లో... మా పాడిపంటల్లో   
బంగారు పైరుల్లోనా సింగారం చిందేసింది


ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో


మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది



No comments:

Post a Comment