చిత్రం : కన్నవారిల్లు (1978)
సంగీతం : ఆదినారాయణరావు
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
చరణం 1 :
కన్నులలోన వెన్నెల వాన
కౌగిలిలోన గారాల కూన
మా పాటకు పల్లవి మీరు
మా తోటకు మల్లెలు మీరు
మా కంటికి దివ్వెలు మీరు
మా పండగనవ్వులు మీరు
చీకటివాకిట ముగ్గుల ముంగిట దీపాలే మీరు
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
చరణం 2 :
తామరపువ్వు తమ్ముడి నవ్వు
కానుక మాకు కావాలి ఇవ్వు
పండుగ వచ్చేయేడు మాతోడుగ వాడుంటాడు
పూవత్తులు వెలిగిస్తాడు పున్నమలే పండిస్తాడు
చుక్కల పందిట అక్కల సందిట జాబిల్లే వాడు
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
చరణం 3 :
పిల్లల నోట చల్లని మాట
పండగ పూట రతనాల మూట
ఈ పాపల కోరికలన్ని మా పాలిటి దీవెనలైతే
ఆ నింగిని తారకలన్ని మాయింటికి దీపాలైతే
రేపులు మాపులు దేవుని చూపులు చల్లనివే మనకు
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8054
No comments:
Post a Comment