Saturday, September 5, 2020

గోల్కొండ ఖిల్లాకాడా



చిత్రం : వస్తాడే మా బావ (1977)
సంగీతం :  ఘంటసాల విజయ్ కుమార్
గీతరచయిత :
నేపథ్య గానం : సుశీల 


పల్లవి :


గోల్కొండ ఖిల్లాకాడా ఈలవేసే అల్లరివాడా
తొందరపడితే అందదు వలపు
మెల్లమెల్లగా కన్నులు కలుపు
ఈలవేసే చిన్నావాడా ఓహో రాజా                 
ఈలవేసే చిన్నావాడా


చరణం 1 :


నౌబత్పహాడు మీద నవ్వుకుందామా         
కిలకిల నవ్వుకుందామా
చార్మీనార్ శిఖరాలందు ఆడుకుందామా             
సరదాలాడుకుందామా
గండిపేట తరగల మీద పండుగ చేసుకుందామా
గండిపేట తరగల మీద పండుగ చేసుకుందామా
అందరాని ఆనందాలు అందుకుందామా                   
అందుకుందామా


గోల్కొండ ఖిల్లాకాడా ఈలవేసే అల్లరివాడా
తొందరపడితే అందదు వలపు
మెల్లమెల్లగా కన్నులు కలుపు
ఈలవేసే చిన్నావాడా ఓహో రాజా                 
ఈలవేసే చిన్నావాడా



చరణం 2 :


భాగేరామ్ పచ్చికలోన పచారు చేయాలి             
ఎంతో హుషారు కావాలి
గుల్మనార్ కొమ్మలకింద గుసగుసలాడాలి               
వయసు మిసమిసలాడాలి
అల్లిబిల్లిగా మల్లెతీగలా అల్లుకుపోవాలి
అల్లిబిల్లిగా మల్లెతీగలా అల్లుకుపోవాలి
ఎవ్వరులేని ఏకాంతంలో ఏకం కావాలి... ఏకం కావాలి


గోల్కొండ ఖిల్లాకాడా ఈలవేసే అల్లరివాడా
తొందరపడితే అందదు వలపు
మెల్లమెల్లగా కన్నులు కలుపు
ఈలవేసే చిన్నావాడా ఓహో రాజా                 
ఈలవేసే చిన్నావాడా

No comments:

Post a Comment