Thursday, September 3, 2020

తినబోతు రుచి అడగకు



చిత్రం : వస్తాడే మా బావ (1977)
సంగీతం :  ఘంటసాల విజయ్ కుమార్
గీతరచయిత : 
నేపథ్య గానం : జిక్కి  


పల్లవి :


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు 



చరణం 1 :


అందం నీదేలే... ఆనందం అతనిదేలే
అందం నీదేలే... ఆనందం అతనిదేలే
పండుగనేడేలే పండుగనేడే
తొందర ఎందుకు ఎందుకు... ఎందుకు


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు 



చరణం 2 :


గదిలోన  ఉన్నాడు గడసరి బావ
మొదటిరేయి ముచ్చటకోసం మోము వాచిపోయె పాపం
మొదటిరేయి ముచ్చటకోసం మోము వాచిపోయె పాపం


చెంతకు వస్తాడే... చిటికెలు వేస్తాడే
చెంతకు వస్తాడే... చిటికెలు వేస్తాడే
ఇంతకుముందు తెలియని వింతలు చేస్తాడే చేస్తాడే
ఏంచేస్తాడే... మురిపిస్తాడే


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు 


చరణం 3 :


చిలకరించుతుంది హాయి తొలకరి వలపు
పలకరించి నవ్వగానే పులకరించు లేత వయసు
పలకరించి నవ్వగానే పులకరించు లేత వయసు


పక్కకు వస్తాడే పరువం దోస్తాడే
పక్కకు వస్తాడే పరువం దోస్తాడే
చక్కిలిగిలితో ఉక్కిరిబిక్కిరి చేస్తాడే.. చేస్తాడు
ఏంచేస్తాడే...  ఊరిస్తాడే 



తినబోతు రుచి అడగకు
తీయనికోర్కెలు దాచకు దాచకు
తినబోతు రుచి అడగకు
తీయనికోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు

No comments:

Post a Comment