Wednesday, September 9, 2020

చిక్కని చీకట్లో





చిత్రం : కృష్ణ గారడి (1986)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం:  ఎం. రమేశ్, సుశీల 


పల్లవి :


చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా
అరే..చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా.. పాపా
అబ్బ నా గుండె తాళాల... నీ కంటి మేళాల మోతేపుడుతుంటే



చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా...
అబ్బ.. చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా... బావ
అబ్బ.. నా ప్రేమ తాళాల నీ పెళ్ళి మేళాల మోతేపుడుతుంటే 



చరణం 1 :


గుడి మీదా గువ్వా వాలే... వడిలోనా వయసూ వాలే
ముడి వెయ్యి కొంగూ బంగారం
ఆకాశ గంగా వంగే.. గోదారి గంగా పొంగే
కలిపెయ్యి నేలా ఆకాశం


మల్లెల తాంబూలం మాపటి వేళల్లో
పచ్చల పేరంటం పగలే పొదరింట్లో
సన్నాయి ఆపంగానే ఉయ్యాలే ఇంట్లో


ఎత్తుకో.. హత్తుకో..
అబ్బ నీ లేత నాజూకు వేస్తుంటే మారాకు వెర్రెత్తిపోతున్నా


చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా... బావ
అబ్బ నా గుండె తాళాల నీ కంటి మేళాల మోతేపుడుతుంటే



చరణం 2 :


మెరుపొచ్చి మేఘాలాడే... ఉరుమొచ్చి నెమలీ ఆడే
ఆడెయ్యి నాతో కోలాటం
చిగురేసి కొమ్మ నవ్వే... మొగ్గేసి రెమ్మా నవ్వే
నవ్వాలి నువ్వే నాకోసం


ఎర్రని పొద్దుల్లో... వెచ్చని సీమంతం
వచ్చిన వయసుల్లో... నిత్యం సాయంత్రం
పారాణి దిద్దంగానే పండే వయ్యారం


గిల్లుకో... అల్లుకో
అబ్బ.. క్రీగంటి నీ చూపు గిచ్చంగ నా సోకు కిర్రెక్కిపోతున్నా



అరే..చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా.. పాపా
అబ్బ నా గుండె తాళాల నీ కంటి మేళాల మోతేపుడుతుంటే 


చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా... బావ
అబ్బ.. నా ప్రేమ తాళాల నీ పెళ్ళి మేళాల మోతేపుడుతుంటే 





No comments:

Post a Comment