చిత్రం : రామాయణంలో పిడకల వేట (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం: బాలు, జానకి
పల్లవి :
హోయ్... పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకల కొలికి
పెళ్లామున్న స్వాములారిని
పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకల కొలికి
పెళ్లామున్న స్వాములారిని
చెప్పిన మాట విననంటావు
జిలిబిలి సరసం లేదంటావు
నీకు నాకు తళాంగు తధిగిణతోం
పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకలకొలికి
పెళ్లామున్న స్వాములారిని
చరణం 1 :
పలుకే బంగారమాయే కులుకే వెటకారమాయే
ఉలకనైనా ఉలకనంటివే
తెలుసు నేనంటే నీకు అలుసు
నేనలుసైపోయా అత్తామామల వత్తాసయినవే
ఇంట్లోపనులు చూడొద్దా ఇంటికి పేరు తేవొద్దా
వేళాపాళా అక్కరలేదా... తళాంగు తధిగిణతోం
పెళ్లైన బ్రహ్మచారిని ఓ చిలకల కొలికి
పెళ్లామున్న స్వాములారిని
చరణం 2 :
పట్టు నేపట్టానంటే ఒట్టు... వదిలిస్తా బెట్టు
డ్యుయెట్టు పాడించుతా
చేదా నా మీద మోజు లేదా
మరి నువ్వు మాత్రం ఉప్పు కారం తినడంలేదా
ఉప్పుకారం తింటున్నా ఎప్పుడెప్పుడని అంటున్నా
ఒప్పు తప్పు తెలియాలి... తళాంగు తధిగిణతోం
పెళ్లైనా బ్రహ్మచారిగారు ఓ గండరగండా
పెళ్లామున్న స్వాములారు
పెళ్లైనా బ్రహ్మచారిగారు ఓ గండరగండా
పెళ్లామున్న స్వాములారు
చెప్పినమాట వింటాలెండి... జిలిబిలి సరసం ఇస్తాలెండి
రాజిమనకు... తళాంగు తధిగిణతోం
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5469
No comments:
Post a Comment