చిత్రం : బంగారు చిలక (1985)
సంగీతం : బాలు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, జానకి
పల్లవి :
చెలి.. సఖి.. మనోహరి... మందార మౌనహాసిని
శ్రుతి లయ సుఖాలలో... శృంగార వీణ మీటనా
ప్రియ సఖ మహోదయ... నారింజ సంధ్య వేళలో
చలి చలి సయ్యాటలో... పారాణి పాట పాడనా
చరణం 1 :
మనసే మరో ప్రపంచమై... మేఘాల తేలగా
భువి అంచుల దివి ముంగిట... నీ మెను తాకనా
వయసే మరో వసంతమై... పూలారబోయగా
తొలి చూపుల మునిమాపుల... హారాలు వేయనా
పొదరింటిలో చెలి చీకటి కౌగిళ్ళ నిండగా
ప్రియ సఖ మహోదయ... నారింజ సంధ్య వేళలో
చలి చలి సయ్యాటలో... పారాణి పాట పాడనా
చరణం 2 :
వలపే సుధా ప్రవాహమై... ఆధారాల నిండగా
ఓడివాకిట బిడియాలకు... అందాలు కూర్చనా
సొగసే కళా సుగంధమై... పరువాలు పెంచగా
కనుపాపలా కసి ఊహల... ఉయ్యాలలూగనా
నీ కౌగిట నే కాటుక... కావ్యాలు రాయనా
చెలి సఖి మనోహరి... మందార మౌనహాసిని
శ్రుతి లయ సుఖాలలో... శృంగార వీణ మీటనా
చెలి సఖా మనోహరి...
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12066
No comments:
Post a Comment