చిత్రం : నవ్వుతూ బతకాలి (1975)
సంగీతం : జి. కె. వెంకటేశ్
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, వేదవతి ప్రభాకర్
పల్లవి :
సింతా సిగురులాంటి సినదానా... సినదానా
సొగసంతా నీ వయసంతా భలేగా ఉన్నదిలే
అది అంతా నాదేలే
సీమాదొరలాంటి చినవాడా... చినవాడా
వలపంతా నీ మనసంతా భలేగా ఉన్నదిలే
అది అంతా నాదేలే
చరణం 1 :
కళ్ళ నుండా ఆశలేవో తెచ్చాను... తీరుననై వచ్చాను
కళ్ళలోనీ ఆశలెన్నో తెలుసునులే... తొందరగ తీరునులే
నీ తోడుంటే అవునంటే అంతే చాలునులే...
అహ అంతే చాలునులే...
సింతా సిగురులాంటి సినదానా... సినదానా
సొగసంతా నీ వయసంతా భలేగా ఉన్నదిలే
అది అంతా నాదేలే
చరణం 2 :
కందిరీగా నడుము దాని అందాలు... కాళ్ళ కవి బంధాలు
కొంటెచూపు పిల్లవాని సరసాలు... నామంచి సరదాలు
నా కలలన్నీ నిజమాయే ఇవాళ నీలోనే
హోయ్... ఇవాళ నీలోనే
సీమాదొరలాంటి చినవాడా... చినవాడా
వలపంతా నీ మనసంతా భలేగా ఉన్నదిలే
అది అంతా నాదేలే
చరణం 3 :
కొమ్మ మీద కోయిలమ్మలు ఉన్నాయి... పాడినవి సన్నాయి
పెళ్ళిపందిట పూలవానలు కురిశాయి... దీవెనలు దొరికాయి
మన ఈ జంట కలకాలం ఇలాగే ఉండాలి
అహ... ఇలాగే ఉండాలి
సింతా సిగురులాంటి సినదానా... సినదానా
వలపంతా నీ మనసంతా భలేగా ఉన్నదిలే
అది అంతా నాదేలే
అహహహహాహహ హా.. ఉం ఉం ఉం ఉం
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5530
చక్కని కృషి అండీ
ReplyDeleteఅభివాదములు మీకు.
సీరామ్
Thank you KEERTHANa gaaru
Deleteఈ పాట రచయిత దాశరథి గారు
ReplyDelete