Thursday, December 10, 2020

రసం మధురసం






చిత్రం :  హరే కృష్ణ హల్లో రాధ (1980)

సంగీతం :  విజయ భాస్కర్

గీతరచయిత :  

నేపథ్య గానం :  బాలు


పల్లవి : 



ఏనాడైనా ఎంతటి ఘనుడైనా

కోరేదొకటే.. సుఖం... సుఖం... సుఖం



రసం మధురసం... మనం పరవశం

భవం అనుభవం... తూలే మైకమే

తరం యువతరం... యుగం అణుయుగం

జగం చెరిసగం... మారే లోకమే


రసం మధురసం... మనం పరవశం

భవం అనుభవం... తూలే మైకమే


చరణం 1 :


ఈ యవ్వనం ఆగదు... ఏ సుఖమును వదలదు

ఈ యవ్వనం ఆగదు... ఏ సుఖమును వదలదు

మంచిచెడ్డ గ్రహించదు... మాయామర్మం భరించదు

తెమ్మంటుంది మజామజా... ఇమ్మంటుంది నిషానిషా

దేఖో పారాహుషార్...


రసం మధురసం... మనం పరవశం

భవం అనుభవం... తూలే మైకమే


చరణం 2 : 


ఈ బ్రతుకులే పరిమితం... రేపెవడురా శాశ్వతం

ఈ బ్రతుకులే పరిమితం... రేపెవడురా శాశ్వతం

ఏడ్చేవాడే బికారిరా... నవ్వేవాడే నవాబురా

గెలిచినవాడే జవానురా... బ్రతికేవాడే మగాడురా

సత్యమింతేనురా


రసం మధురసం... మనం పరవశం

భవం అనుభవం... తూలే మైకమే



చరణం 3 :


ఈ జగతికే రాత్రిరా... నా జాతికే పగలురా

ఆహాహా...

ఈ జగతికే రాత్రిరా... నా జాతికే పగలురా

కావల్సిందే వినోదము... లేదిక మాకు విషాదము

సాగించండి సరాగము... మత్తెక్కడమే ప్రధానము

మందే మా దైవము....


రసం మధురసం... మనం పరవశం

భవం అనుభవం... తూలే మైకమే




No comments:

Post a Comment