చిత్రం : సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత : అనిశెట్టి
నేపథ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కనుమూసినా కనిపించే నిజమిదేరా
ఇలలేదురా నీతి... ఇంతేనురా లోకరీతి
కనుమూసినా కనిపించే నిజమిదేరా
ఇలలేదురా నీతి... ఇంతేనురా లోకరీతి
మేలుకో మేలుకో...
చరణం 1 :
ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ
భ్రమలు గొలిపే మెరుపులేరా జగతిలో ఆశలూ
భ్రమలు గొలిపే మెరుపులేరా జగతిలో ఆశలూ
సుఖము కోరీ... ఈ ఎడారీ... సాగేవురా లేదు దారీ
కనుమూసినా కనిపించే నిజమిదేరా
ఇల లేదురా నీతి... ఇంతేనురా లోకరీతి
మేలుకో మేలుకో...
చరణం 2 :
ఓ ఓ ఓ ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ
కలకాలము ఈ కాళరాత్రి
నిలువదోయీ మేలుకో...
మేలుకో ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ ఓ
కలకాలము ఈ కాళరాత్రి... నిలువదోయీ మేలుకో మేలుకో
ఉదయ కాంతి... మదికి శాంతి... సాధించరా బాటసారీ
కనుమూసినా కనిపించే నిజమిదేరా
ఇల లేదురా నీతి... ఇంతేనురా లోకరీతి...
మేలుకో...
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1014
Thanks andee
ReplyDeleteఅనిశెట్టి - పాటలు మణిపూసలు ; & మీ బ్లాగు - తెలుగు సినిమా పాటలను - పాట యొక్క పూర్తి సాహిత్యాన్ని - కూర్చి, మరీ - పాఠకులకు ఇస్తున్నారు - Thank u very much
ReplyDeleteThank you Nawadawana
Delete