Wednesday, February 17, 2021

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

 శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం





కౌసల్య తనయ! శ్రీరామ! కౌస్తుభాంగా 
తూర్పున భానుడుదయించె తోయజాక్షా
దేవ సంబంధ కార్యాలను తీర్చుకోగ
వేడుకొందుము మేలుకో... శ్రీ వేంకటేశా
లేవయ్య శ్రీహరి గోవింద లెమ్ము నిదురా
కళ్యాణ మొనరించ వేగ కమలనయనా
ప్రొదెక్క నున్న దటు చూడ భుజగ శయనా
వేగలేవయ్య మము బ్రోవ వేంకటేశా
మధుకైట భారి, శ్రీ హరి ప్రక్కనుండి,
ఎల్ల లోకములు గన్న మా తల్లీ, లక్ష్మీ,
ఆశ్రిత మానవుల సదా... ఆదరించ
అలివేలు మంగమ్మ ఇక మేలుకొమ్మా ఆ ఆ



బ్రహ్మాది దేవతలందరు భక్తి మీర
సురగురూత్తముని వెంట తరలి నేడు
నీ దివ్య రూపంబు గానగ నిలచినారు
శీఘ్రముగ లేవయ్య శ్రీ శ్రీనివాసా
కమలాలు వికసించు కాలమాయే
నానా సుగంధ కుసుమాలు నవ్వె నవిగో
పక్షుల గుంపుల తీయని పాట వినగ
వేగ లేవయ్య నిదుర శ్రీ వేంకటేశా  ఆ ఆ
గ్రహములన్నియు నీ యనుగ్రహము పొందా
అష్టదిక్పాలు రందరు నిష్టతోడా
నీదు పుష్కర స్నానమాడి నిలచినారు
చూడ లేలెమ్ము... అయ్యెనిక సుప్రభాతం ఆ ఆ ఆ


పద్మనాభ... పురుషోత్తమ... పాపనాశా 
వేంకటా చలపతి.. విభో.. వేంకటేశా 
శీఘ్రముగ లేవయ్య ప్రభు శ్రీనివాస
జూడ మా తండ్రి అయ్యెనిక సుప్రభాతం సుప్రభాతం ఊ ఊ
ఆకాశ గంగోదకంబును లోకనాధ
తెచ్చి పూజాదులకై ముందె వచ్చిరయ్యా
వేదోప నిషన్ మూర్తులౌ వైదికులును
వేచియున్నారు లేవయ్యా శ్రీవేంకటేశా ఆ ఆ ఆ
లేచి నిను జూడ యీ వేళ నోచినామూ
ప్రభూ... లేచి నిను జూడ యీ వేళ నోచినామూ
ఏ పూర్వ పుణ్య ఫలముగా యెరుగ లేము
చేసిన పాపాలు నేటితో మాసిపోగ
వేడుకొందుము కఋనించ వేంకటేశా ఆ ఆ ఆ ఆ

మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనీ
చక్రవర్తి తనూజాయ సార్వ భూమాయ మంగళం




2 comments: