చిత్రం : మాయావి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : డి. కృష్ణమూర్తి
నేపథ్య గానం : ఎస్. జానకి
పల్లవి :
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
భారమైన గుండెల్లో ఆరని దీపాలు
ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
ఓ... ఓ... ఓ... ఓ...
ఓ.... ఓ... ఓ...
చరణం 1 :
తోడు దొరకని బ్రతుకులలో... తోచే శోధనలు
మాయలెరుగని మనసులలో... మండే వేదనలు
కనిపెట్టి కరుణించేవి... కరుణించి కాపాడేవి
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
భారమైన గుండెల్లో ఆరని దీపాలు
ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
ఓ... ఓ... ఓ.. ఓ...
చరణం 2 :
మూసే చీకటి ముసుగుల్లో... దాగినవెన్నెన్నో
చేసే మాయల వేషం వెనుక దాచినవేమేమో
పయనించి పరికించేవి... పరికించి పాలించేవి
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
భారమైన గుండెల్లో ఆరని దీపాలు
ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7217
No comments:
Post a Comment