Wednesday, February 3, 2021

అనాదిగా జరుగుతున్న




చిత్రం : తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : సుశీల 


పల్లవి :


అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే

అదేమిటో... ఆడదంటే మగవాడికి అలుసులే


అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే

అదేమిటో... ఆడదంటే మగవాడికి అలుసులే


అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే


చరణం 1 :


ఎవడో ఒకడన్నాడని... అదియే ప్రజావాక్యమని

ఎవడో ఒకడన్నాడని... అదియే ప్రజావాక్యమని

అగ్ని వంటి అర్థాంగిని అడవి కంపె రాముడు... 

అగ్ని వంటి అర్థాంగిని అడవి కంపె రాముడు... శ్రీరాముడు


అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే


చరణం 2 :


జూదమాడి ఒక రాజు ఆలి నోడినాడు 

జూదమాడి ఒక రాజు ఆలి నోడినాడు 

సత్యం సత్యమని ఒక మగడు సతిని అమ్మినాడు 

సత్యం సత్యమని ఒక మగడు సతిని అమ్మినాడు


అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే

అదేమిటో... 


చరణం 3 :


కాలం మారిందని అన్నారు... సంఘం మారిందన్నారు

మారలేదు మారలేదు మగవారి మనసులు

ఈ మనసు లేని చేష్టలు


అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే

అదేమిటో... ఆడదంటే మగవాడికి అలుసులే


అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3532

No comments:

Post a Comment