చిత్రం : తేనె మనసులు (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల
పల్లవి :
ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని
ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని
ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని
ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని
చరణం 1 :
దీపముంటే సిగ్గంటివి... చీకటైనా సిగ్గెందుకు
దీపముంటే సిగ్గంటివి... చీకటైనా సిగ్గెందుకు
మొగ్గ విరిసే తీరాలి... సిగ్గు విడిచే పోవాలి
ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని
ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని
చరణం 2 :
ఆ గదిలో నీ హృదిలో... కౌగిలిలో ఈ బిగిలో
ఆ గదిలో నీ హృదిలో... కౌగిలిలో ఈ బిగిలో
ఎలా ఉందో ఏమౌతుందో... ఏం చేయాలని నీకుందో... చెప్పు
ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని
ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని
చరణం 3 :
ఊహు! పక్కన చేరాడా చేరి... చెక్కిలి నొక్కాడా
చెల్లీ పక్కన చేరాడా చేరి... చెక్కిలి నొక్కాడా
ఇక్కడనా? చెక్కిలినా?... ఏమిటిదీ గిల్లినదా...
ఇక్కడనా? చెక్కిలినా?... ఏమిటిదీ గిల్లినదా...
పంటికి గోటికి తేడా లేదా
ఎందుకులే... ఎందుకులే... ఈ బుకాయింపులు
ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని
ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని
చరణం 4 :
పగటి వేషం నాదమ్మా... రాత్రి నాటకం నీదమ్మా
పగటి వేషం నాదమ్మా... రాత్రి నాటకం నీదమ్మా
అందుకని... అందుకని
నువు చేసినదంతా చెప్పాలి...
నువు చేసినదంతా చెప్పాలి... నే చెప్పినట్లు నువు చేయాలి
ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని
ఆలుమగల మధ్యనున్నది ఎవరికి తెలియదని
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7063
No comments:
Post a Comment