Saturday, December 23, 2023

ధన్వంతరి వారసులం




చిత్రం :  అరుణ కిరణం (1986)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : జానకి 


పల్లవి :


ధన్వంతరి వారసులం... ధరణిలోన దేవతలం

వ్యాధులతో బాధపడే ఆర్తుల క్షేమం కోసం  

కృషి చేసే కర్మయోగులం

మనకెందుకు మనసులేని నినాదాల రణరంగం

జీవులనే పావులతో ఆడుకునే చదరంగం


ధన్వంతరి వారసులం... ధరణిలోన దేవతలం



చరణం 1 : 


పసిపాపల కోల్పోయిన తల్లుల ఆక్రందనలో 

తాళిబొట్టు తెగిపొయిన తరుణుల ఆవేదనలో 

శ్మశానమై పోతుంటే ఈ వైద్యాలయం 

ఎక్కడుంది కారుణ్యం... ఎందుకింత యమధర్మం

ఈ దీనుల సమాధులా... విజయానికి పునాదులు

ఎందుకిలా ప్రాణంతో వ్యాపారం... ఎన్నాళ్ళీ వైద్యంతో వాణిజ్యం


ధన్వంతరి వారసులం... ధరణిలోన దేవతలం


చరణం 2 : 


పట్టం పొందిన నాడు చేసిన మన వాగ్ధానం

మరచిపోతే జరిగేది సాముహిక బలిదానం

నైటింగేల్ ఫ్లొరెన్స్ లకే అపచారం

జ్యోతివంటిదీ వైద్యం... జ్వాల అయితే అది విలయం

రక్షకులే భక్షకులై సాధించె విజయాలు

ఎందుకీ బలికోరే బ్రతుకులు... రక్తంతో మైలపడ్డ మెతుకులు 

రక్తంతో మైలపడ్డ మెతుకులు



No comments:

Post a Comment