Showing posts with label అంతం కాదిది ఆరంభం (1981). Show all posts
Showing posts with label అంతం కాదిది ఆరంభం (1981). Show all posts

Monday, April 13, 2020

అబ్బలాలో... అమ్మలాలో...

చిత్రం:  అంతం కాదిది ఆరంభం (1981)
సంగీతం:  రమేశ్ నాయుడు
గీతరచయిత:  వేటూరి
నేపథ్య గానం:  బాలు, సుశీల



పల్లవి :


అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...


అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా


అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...


చరణం 1 :


తొలకరి వలపులు పూతకు వచ్చే వేళా...  చల్లని వేళా
తొలకరి వలపులు పూతకు వచ్చే వేళా...  చల్లని వేళా
మామిళ్ళు కోరాలా వేవిళ్ళ వేళా...
కౌగిళ్ళు దూరాలా చూలింత వేళా
నీ ఆపసోపాలు నే చూసి నవ్వాలా...
నా నవ్వులే నీకు సిగపువ్వులవ్వాలా



అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...


అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా


అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...


చరణం 2 :


తొమ్మిది నెలలకు కొమ్మలు పండే వేళా... పండుగ వేళా
తొమ్మిది నెలలకు కొమ్మలు పండే వేళా... పండుగ వేళా
తొలి పొద్దు పొడవాల మన ఇంటిలోనా...
తొలి పువ్వు నవ్వాల మన తోటలోనా
ఇల్లాలికే లాలి పాపాయి పాడాలా...
ఆ ముద్దులే ఇంటి మురిపాలు కావాలి



అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...


అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా


అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...

చరణం 3 :


గోరంత దీపాలు తొలినాటి వలపు... కొండంత వెలుగుళ్లో ఈనాటి తలపు
పరువాల పాపాయి ఆపాలి గోలా... మురిపాల మన పాప కోరేను జోలా 


అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...


అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా


అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...

నిన్నంటుకోవాలి ఈ పొద్దు

చిత్రం:  అంతం కాదిది ఆరంభం (1981)
సంగీతం:  రమేశ్ నాయుడు
గీతరచయిత:  వేటూరి
నేపథ్య గానం:  బాలు, సుశీల, శైలజ


పల్లవి :


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఆ.. ఆ.. ఆ.. ఆ... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఏహే..హే..హే... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...


నిన్నంటుకోవాలి ఈ పొద్దు...


చరణం 1 :


నీలో నాలో ఆరాటాలు.. హోరాహోరీ పోరాటాలు
నీలో నాలో ఆరాటాలు.. హోరాహోరీ పోరాటాలు


కొంగు తగిలిందా... ఆ.. కొంటెకోలాటం..పపపప..
పెదవి పెగిలిందా.. ఆ.. ఆ. జంట పేరంటం...పపపప..


వన్నెలాడి కౌగిళ్ళు.. అహహహ.. సన్నజాజి వత్తిళ్ళు
వన్నెలాడి కౌగిళ్ళు.. అహహహ.. సన్నజాజి వత్తిళ్ళు
వాయిదా వేసుకో... ముద్దుగా వెళ్ళిపో...


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఆ.. ఆ.. ఆ.. ఆ... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...


చరణం 2 :


జలకమాడే చిలకమ్మా... పలకమారిన పండమ్మా
తడితడి తపనలు చాలమ్మా... విడివిడిగా ఉంటే గోలమ్మా
తడితడి తపనలు చాలమ్మా... విడిగా ఉంటే గోలమ్మా


నీటిమంటలు తగిలాయి.. ఒంటి మంటలు రగిలాయి
జంటకొస్తే ఈరేయి... జరగనీయ్ కథ తరువాయి


చక్కిలిగింతలు చాలమ్మా... హహహహా... కౌగిలిగింతలు ఏలమ్మా
చక్కిలిగింతలు చాలమ్మా... కౌగిలిగింతలు ఏలమ్మా
పోయింది కథ కంచికి... పోవమ్మా నీ ఇంటికి... హహహహ


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహానేనంటుకోబోతే ఆపొద్దు... ఆహాఏహే..హే..హే... అందాలు అందించుకో...హ్మ్మ్.. హ్మ్మ్మ్... హ్మ్మ్...


చరణం 3 :


చాలోయమ్మా సాయంత్రాలు... చలి చూపుల్లో నీ మంత్రాలు
చాలోయమ్మా సాయంత్రాలు... చలి చూపుల్లో నీ మంత్రాలు


నీవు తోడుంటే నిదుర రాదాయే.. షబరిబరిబా.. పపపప
నిదుర కాకుంటే నీవు రావాయే... పపపప


ఎదలే చెదిరే కథలే ముదిరే... హహహహ
కలలే గెలలై వలపుల వలలై... హహహహ
ఎదలే చెదిరే కథలే ముదిరే...
కలలే గెలలై వలపుల వలలై..
నిదురలేదమ్మో... వదలిపోవమ్మో.. హహా


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఆ.. ఆ.. ఆ.. ఆ... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...




Tuesday, January 3, 2017

రగిలే రాసలీల





చిత్రం:  అంతం కాదిది ఆరంభం (1981)
సంగీతం:  రమేశ్ నాయుడు
గీతరచయిత:  వేటూరి
నేపధ్య గానం:  ఎస్. పి. శైలజ  




పల్లవి :



రగిలే రాసలీల... ఎదలో రేగే జ్వాల
రగిలే రాసలీల... ఎదలో రేగే జ్వాల
అడుగులలో నడకలలో పిడుగులు రాలా
నేనాడనా.. పాడనా...


రగిలే రాసలీల... ఎదలో రేగే జ్వాల



చరణం 1 :



కన్నీటి పాపాయి నవ్వింది నాలో...
కవ్వింతగా వింతగా.. ఆ.. ఈ పాటకే వంతగా
కన్నీటి పాపాయి నవ్వింది నాలో...
కవ్వింతగా వింతగా.. ఆ.. ఈ పాటకే వంతగా


మిగిలింది నాలోని చిననాటి చిరునవ్వు
మిగిలింది నాలోని చిననాటి చిరునవ్వు
నాకు సిగపువ్వుగా.. జన్మపులకింతగా



రగిలే రాసలీల... ఎదలో రేగే జ్వాల



చరణం 2 :



కరిగేను కాలాలే నా గుండెలోనా...
రాగాలు తాళాలుగా.. ఆ.. సైయ్యాటగా పాటగా
కరిగేను కాలాలే నా గుండెలోనా...
రాగాలు తాళాలుగా.. ఆ.. సైయ్యాటగా పాటగా


పలికేను నాలోనా ప్రియమైన లయలోనా
పలికేను నాలోనా ప్రియమైన లయలోనా
ప్రేమ కడసారిగా.. జన్మ కడతేరగా


రగిలే రాసలీల... ఎదలో రేగే జ్వాల
అడుగులలో నడకలలో పిడుగులు రాలా
నేనాడనా.. పాడనా...


ముగిసే రాసలీల... రాలే పూలమాల
ముగిసే రాసలీల... రాలే పూలమాల






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3257