Monday, April 13, 2020

నిన్నంటుకోవాలి ఈ పొద్దు

చిత్రం:  అంతం కాదిది ఆరంభం (1981)
సంగీతం:  రమేశ్ నాయుడు
గీతరచయిత:  వేటూరి
నేపథ్య గానం:  బాలు, సుశీల, శైలజ


పల్లవి :


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఆ.. ఆ.. ఆ.. ఆ... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఏహే..హే..హే... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...


నిన్నంటుకోవాలి ఈ పొద్దు...


చరణం 1 :


నీలో నాలో ఆరాటాలు.. హోరాహోరీ పోరాటాలు
నీలో నాలో ఆరాటాలు.. హోరాహోరీ పోరాటాలు


కొంగు తగిలిందా... ఆ.. కొంటెకోలాటం..పపపప..
పెదవి పెగిలిందా.. ఆ.. ఆ. జంట పేరంటం...పపపప..


వన్నెలాడి కౌగిళ్ళు.. అహహహ.. సన్నజాజి వత్తిళ్ళు
వన్నెలాడి కౌగిళ్ళు.. అహహహ.. సన్నజాజి వత్తిళ్ళు
వాయిదా వేసుకో... ముద్దుగా వెళ్ళిపో...


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఆ.. ఆ.. ఆ.. ఆ... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...


చరణం 2 :


జలకమాడే చిలకమ్మా... పలకమారిన పండమ్మా
తడితడి తపనలు చాలమ్మా... విడివిడిగా ఉంటే గోలమ్మా
తడితడి తపనలు చాలమ్మా... విడిగా ఉంటే గోలమ్మా


నీటిమంటలు తగిలాయి.. ఒంటి మంటలు రగిలాయి
జంటకొస్తే ఈరేయి... జరగనీయ్ కథ తరువాయి


చక్కిలిగింతలు చాలమ్మా... హహహహా... కౌగిలిగింతలు ఏలమ్మా
చక్కిలిగింతలు చాలమ్మా... కౌగిలిగింతలు ఏలమ్మా
పోయింది కథ కంచికి... పోవమ్మా నీ ఇంటికి... హహహహ


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహానేనంటుకోబోతే ఆపొద్దు... ఆహాఏహే..హే..హే... అందాలు అందించుకో...హ్మ్మ్.. హ్మ్మ్మ్... హ్మ్మ్...


చరణం 3 :


చాలోయమ్మా సాయంత్రాలు... చలి చూపుల్లో నీ మంత్రాలు
చాలోయమ్మా సాయంత్రాలు... చలి చూపుల్లో నీ మంత్రాలు


నీవు తోడుంటే నిదుర రాదాయే.. షబరిబరిబా.. పపపప
నిదుర కాకుంటే నీవు రావాయే... పపపప


ఎదలే చెదిరే కథలే ముదిరే... హహహహ
కలలే గెలలై వలపుల వలలై... హహహహ
ఎదలే చెదిరే కథలే ముదిరే...
కలలే గెలలై వలపుల వలలై..
నిదురలేదమ్మో... వదలిపోవమ్మో.. హహా


నిన్నంటుకోవాలి ఈ పొద్దు... అహా
నేనంటుకోబోతే ఆపొద్దు... ఆహా
ఆ.. ఆ.. ఆ.. ఆ... అందాలు అందించుకో...
ఓ..హో..హో..హో...




No comments:

Post a Comment