చిత్రం: అంతం కాదిది ఆరంభం (1981)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
చరణం 1 :
తొలకరి వలపులు పూతకు వచ్చే వేళా... చల్లని వేళా
తొలకరి వలపులు పూతకు వచ్చే వేళా... చల్లని వేళా
మామిళ్ళు కోరాలా వేవిళ్ళ వేళా...
కౌగిళ్ళు దూరాలా చూలింత వేళా
నీ ఆపసోపాలు నే చూసి నవ్వాలా...
నా నవ్వులే నీకు సిగపువ్వులవ్వాలా
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
చరణం 2 :
తొమ్మిది నెలలకు కొమ్మలు పండే వేళా... పండుగ వేళా
తొమ్మిది నెలలకు కొమ్మలు పండే వేళా... పండుగ వేళా
తొలి పొద్దు పొడవాల మన ఇంటిలోనా...
తొలి పువ్వు నవ్వాల మన తోటలోనా
ఇల్లాలికే లాలి పాపాయి పాడాలా...
ఆ ముద్దులే ఇంటి మురిపాలు కావాలి
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
చరణం 3 :
గోరంత దీపాలు తొలినాటి వలపు... కొండంత వెలుగుళ్లో ఈనాటి తలపు
పరువాల పాపాయి ఆపాలి గోలా... మురిపాల మన పాప కోరేను జోలా
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
అయ్యా నేను అమ్మా నువ్వు ఓయబ్బలాలో..
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
ఉంగా ఉంగా ఉయ్యాలా... ఉగ్గుపాలు పట్టాలా
అబ్బలాలో... అమ్మలాలో...
అబ్బలాలో... అమ్మలాలో...
No comments:
Post a Comment