Showing posts with label ఇంటికి దీపం ఇల్లాలే (1961). Show all posts
Showing posts with label ఇంటికి దీపం ఇల్లాలే (1961). Show all posts

Monday, July 9, 2018

ఎవరికి ఎవరు కాపలా

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్



పల్లవి :



కాపలా..ఆ ఆ ఆ
కాపలా..ఆ ఆ ఆ


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ
బంధాలన్నీ... నీకేలా
ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా
ఈ బంధాలన్నీ... నీకేలా?
ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా





చరణం 1 :



తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదిలి తరలే వేళ
తనువును వదిలి తరలే వేళ
మన మంచే..ఏ... ఏ.. మనకు కాపలా..ఆఆఆ   


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా



చరణం 2 :



కంటికి రెప్పే కాపలా
కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వము తొలగిన వేళ
పెట్టినదేరా..ఆ... ఆ... గట్టి కాపలా


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా



చరణం 3 :



చిన్నతనాన తల్లి కాపలా
వయసున వలచిన వారు కాపలా
ఎవరి ప్రేమకు నోచని వేళ
కన్నీరేరా... ఆ... ఆ... నీకు కాపలా
కన్నీరేరా... నీకు కాపలా


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా
ఈ బంధాలన్నీ... నీకేలా?
ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18317

నీవే నీవే కావలసినది

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 



పల్లవి :



ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో
ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది



చరణం 1 :



నీ వలపు నీడలో నా తలపె ఆగెనే
నీ ఎదట నా హృదయం మూగపోయి నిలిచెనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ వలపు నీడలో నా తలపె ఆగెనే
నీ ఎదట నా హృదయం మూగపోయి నిలిచెనే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 

వేచి వేచి వేదనలో వేడాయే వెన్నెలే
వేచి వేచి వేదనలో వేడాయే వెన్నెలే
చూసి చూసి సోయగాలు...  సోలిపోయే కన్నులే
సోలిపోయే కన్నులే 


ఓఓ... ఓఓఓఓ..
నీవే నీవే ... నిన్నే నిన్నే
నీవే నీవే ... కావలసినది
నిన్నే నిన్నే... ... నే వలచినది..
ఆ హా హా... ఓ హో హో ఆ హా అహా 



చరణం 2 :



నీ కోసమే జీవనం... నీ రూపమె భావనం
నీవు లేని నిముషాన ఈ జగమే కాననం
ఆ ... ఆ... ఆ...  ఆ
నీ కోసమే జీవనం... నీ రూపమె భావనం
నీవు లేని నిముషాన  ఈ జగమే కాననం
ఓ...  ఓ...  ఓ... ఓ ... 


నీ కనులా జాడలో... నా కలలు పండెనే
నీ కనులా జాడలో... నా కలలు పండెనే
నీవు లేక నేనిక... తావిలేని పూవులే
తావిలేని పూవులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=627

ఒకే రాగం ఒకే తాళం

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల


పల్లవి :



ఒకే రాగం...  ఒకే తాళం...
ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా





చరణం 1 :



కనుల ఒక రూపే కదలాడే చూడూ
మనసునొక మాటే మరిపించె నేడూ
ఆ... ఆ... ఆ... ఆ... ఆ
కనుల ఒక రూపే కదలాడే చూడూ
మనసునొక మాటే మరిపించె నేడూ


విరియు విరిబాలలో... దరియు చిరుగాలిలో
మరియు మదిలోతులో... ఒకే అనురాగమే
విరియు విరిబాలలో... దరియు చిరుగాలిలో
మరియు మదిలోతులో...  ఒకే అనురాగమే


ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా 



చరణం 2 :



నాడు నెలరాజు వలె వచ్చినాడు
నేడు నారాజే నను పంపినాడు
ఆ...  ఆ... ఆ...  ఆ
నాడు నెలరాజు వలె వచ్చినాడు
నేడు నారాజే నను పంపినాడు


తలపు పులకించెనే... వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే... ఇదే ఆనందమే
తలపు పులకించెనే... వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే... ఇదే ఆనందమే



ఒకే రాగం...  ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం...  ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18312

Thursday, August 16, 2012

వినుము చెలి తెలిపెదనే

చిత్రం: ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం

హృదయములు నయనములు ఏకమాయెనే
మా ఇరువురికి భేదమింక లేక లేకపోయెనే..ఏ..

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం

చరణం 1:

వచ్చెనులే నిల్చెనులే వాకిలి ముందు
కాంచితిని కాంచితిని కన్నుల విందు
ఓహోహో.. ఓ..ఓ..ఓ.. ఓహోహో.. 

ఓ..ఓ..ఓ.. ఓహోహో.. ఓ..ఓ..ఓ..ఓ.. 

వచ్చెనులే నిల్చెనులే వాకిలి ముందు
కాంచితిని కాంచితిని కన్నుల విందు
నా జడలో పూవులలో తురిమెద నేనే..ఏ..
నా నొసట తిలకము నే దిద్దెద నేడే..ఏ..

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం

చరణం 2:

అతడే నా పతియనుచూ పాట పాడుతా
అతని డెందమున అందముగ నటనమాడుతా
ఆ.. అతడే నా పతియనుచూ పాట పాడుతా
అతని డెందమున అందముగ నటనమాడుతా


వివరముల తెలుపుటకే సమయము కాదు
ఆ విషయముల తీరికగ తెలిపెద నీకూ..ఊ..

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం

హృదయములు నయనములు ఏకమాయెనే
మా ఇరువురికి భేదమింక లేక లేకపోయెనే..ఏ..

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరూ తెలియరాని మధుర రహస్యం