Showing posts with label ఎస్.ఎ. రాజ్ కుమార్. Show all posts
Showing posts with label ఎస్.ఎ. రాజ్ కుమార్. Show all posts

Tuesday, July 23, 2013

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి

చిత్రం: డాడీ (2001)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
నేపధ్య గానం: హరిహరన్

పల్లవి:

ఊఁహూఁహూఁ.. ఊఁహూఁ.. ఊఁ..
ఓహోహోహో.. హోహో.. ఓ..

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి

వద్దంటే వినదే పగలంతా ఆడి పాడీ
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

చరణం 1:

ఆ..ఆ..ఆ..

ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో

నా తల్లివి నువ్వో.. నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో..ఓ..
చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లీ
పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి..

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

చరణం 2:

వర్షంలో తడిసొచ్చీ హాయిరే హాయ్ అనుకుందామా
వర్షంలో తడిసొచ్చీ హాయిరే హాయ్ అనుకుందామా
రేపుదయం జలుబొచ్చీ హాచ్చి హాచ్చి అందామా

ఓ వంక నీకూ.. ఓ వంక నాకూ
ఆవిరిపడుతూనే మీ మమ్మీ..ఈ..
హైపిచ్ లో మ్యూజికల్లే తిడుతుంటుందే
మన తుమ్ములు డ్యూయట్లల్లే వినబడుతుంటే

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడీ
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి..ఈ..ఈ..
పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి