Showing posts with label హరిహరన్. Show all posts
Showing posts with label హరిహరన్. Show all posts

Saturday, August 3, 2013

దూకుతోంది లేత ఈడు

చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: హరిహరన్, సౌమ్య

పల్లవి:

హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
ఇంకా ఏదో కావాలంటూ

వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ..యే

చరణం 1:

ఆ..ఆ
వొంపు వొంపులోన ఉరికింది తాపం
చంపుతోంది నన్ను నాజూకు రూపం
ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో
ఇంకా ఏదో ఐపోమంటూ...

ఉప్పొంగి దూకుతోంది లేత యీడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి

చరణం 2:

ఆ..ఆ..
గోటిగాటు తీపి గాయాలు రేపి
పంటిగాటు తోటి ప్రాయాన్ని లేపి
నరనరములా నిప్పు రాజేసిన మత్తులో
ఇంకా యేదో చేసేయ్‌మంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ

ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో....

Tuesday, July 23, 2013

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి

చిత్రం: డాడీ (2001)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
నేపధ్య గానం: హరిహరన్

పల్లవి:

ఊఁహూఁహూఁ.. ఊఁహూఁ.. ఊఁ..
ఓహోహోహో.. హోహో.. ఓ..

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి

వద్దంటే వినదే పగలంతా ఆడి పాడీ
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి
పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

చరణం 1:

ఆ..ఆ..ఆ..

ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో
నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో

నా తల్లివి నువ్వో.. నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో..ఓ..
చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లీ
పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి..

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

చరణం 2:

వర్షంలో తడిసొచ్చీ హాయిరే హాయ్ అనుకుందామా
వర్షంలో తడిసొచ్చీ హాయిరే హాయ్ అనుకుందామా
రేపుదయం జలుబొచ్చీ హాచ్చి హాచ్చి అందామా

ఓ వంక నీకూ.. ఓ వంక నాకూ
ఆవిరిపడుతూనే మీ మమ్మీ..ఈ..
హైపిచ్ లో మ్యూజికల్లే తిడుతుంటుందే
మన తుమ్ములు డ్యూయట్లల్లే వినబడుతుంటే

గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంతా ఆడి పాడీ
ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి
చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి..ఈ..ఈ..
పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి

Monday, July 22, 2013

చిన్నగ చిన్నగ చిన్నగ

చిత్రం: ఠాగూర్ (2003) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపథ్య గానం: హరిహరన్, చిత్ర 

పల్లవి: 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయ్యాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

Wednesday, January 30, 2013

పిల్లన గ్రోవి నేనై

చిత్రం: చేతిలో చెయ్యేసి (2010) 
సంగీతం: బంటి 
గీతరచయిత: చంద్రబోస్ 
నేపధ్య గానం: హరిహరన్, అల్కా 

పల్లవి: 

పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై 
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం 
పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై 
అల్లుకుపోయే రాగం .. ఆనంద రాగం 

రాగానికే రూపం ఒచ్చి .. రూపమిలా ఎదురుగ నిలిచి 
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం 

చరణం 1: 

మొదటి సారి నిను చూడగానే .. ఆశ్చర్యరాగం 
మదిని తెరిచి మాటాడగానే .. ఆహ్వానరాగం 
చొరవ చేసి నను చేరగానే .. ఆందోళరాగం 
చెలిమి చేయి కలిపేయగానే .. అవలీలరాగం 

నవ్వులోన నవనీత రాగం .. సిగ్గులోన గిలిగింతరాగం 
ఒంపులోన ఒలికింత రాగం .. ఓపలేని విపరీత రాగం 
అణువుఆణువున పలికెను మనలో .. అనురాగ రాగం .. అదే ప్రాణ రాగం 

రాగానికే రూపం ఒచ్చి .. రూపమిలా ఎదురుగ నిలిచి 
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం 

చరణం 2: 

ఇరువురం దూర దూరముంటే .. ఇబ్బందిరాగం 
బంధమై స్పందించుతుంటే .. నిర్బంధరాగం 
పెదవి మీటి పెనవేసుకుంటే .. నిశ్శబ్దరాగం 
మధుర నిధిని దోచేసుకుంటే .. నిక్షేప రాగం 

తనువులోన తారంగ రాగం .. క్షణముకొక్క కేరింతరాగం 
కలలోన కల్లోల రాగం .. కలిసిపోతే కళ్యాణరాగం 
ఇద్దరమొకటై ముద్దుగ ఉంటే అద్వైత రాగం ..అదే మోక్షరాగం 

పిల్లన గ్రోవి నేనై ..చల్లని గాలి నువ్వై 
ఆలాపించే రాగం ...ఆత్మీయ రాగం .. అదే ప్రేమ రాగం

Tuesday, January 29, 2013

యమహానగరి కలకత్తా పురి

చిత్రం: చూడాలనివుంది (1998)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: హరిహరన్

పల్లవి:

సరిమామగారి సనసనిదపసా
సరిమామగారి సనసనిదపసా
రిమదానిదాప సాసనిదప మదపమరి

యమహానగరి కలకత్తా పురి
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి

చరణం 1:

నేతాజీ పుట్టినచోట గీతాంజలి పూసిన చోట
పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వేయి పందెం
కడకు చేరాలి గమ్యం కదలిపోరా
ఒకరికితో ఒకరికి ముఖపరిచయములు
దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి

చరణం 2:

బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల
మానినీ సరోజిని
రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీగంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం
దేవతా... మార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా
కథలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అతిధుల గొడవట
కటకట నగరపు కిటకిటలో

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి

చరణం 3:

వందేమాతరమే అన్నా వంగ భూతలమే మిన్న
జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
విను గురు సత్యజిత్‌రే సితారా
యస్.డి. బర్మన్ కీ ధారా
థెరీసాకీ కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన
ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో

యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధి
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహో హుగిలీ హౌరా వారధీ ఈఈఈ

Monday, December 10, 2012

క్లాసు రూములో తపస్సు

చిత్రం: గులాబి (1996)
సంగీతం: శశి ప్రీతం
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: హరిహరన్

పల్లవి:

క్లాసు రూములో తపస్సు చేయుట వేష్టు రా గురూ.. ఆహా
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ.. ఆహా
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ.. ఆహా
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురూ.. ఆహా

చరణం 1:

సా నిసా నీ దపా సా నిసా నీ దపా
షీషోరులోన నిన్నొక మిస్ తెగ వేసేసిందిర ఫ్రీ షోష్స్
షాక్ అయిపోయా ప్రామిస్ అసలా షోకేందిర జస్ట్ టూ పీస్

she is like a venus so chance ఇస్తేను how nice
wish me success..yup..yup..

మై డియర్ జూనియర్ వై ఫియర్ లే బ్రదర్
Oh shameless simply useless mister drop all this rubbish
nI manliness కో litmus test raa silly full of bullshit
life is so precious stop your foolishness
క్రేజి.... క్రేజి.... క్రేజి
సపనిస సమగస.. సపనిస గరిరిస...
సపనిస సమగస.. సపనిస గరిరిస....

చరణం 2:

సా నిసా నీ దపా సా నిసా నీ దపా
సినిమాలలో రీసర్చ్ చెయ్
atleast character అవుతావురోయ్
సర్కస్ ప్రాక్టిస్ చెయరోయ్ హీరోగా పనికొస్తావోయ్
హీరో... హీరో.... హీరో

సా నిసా నీ దపా సా నిసా నీ దపా
ముప్పూటలా గావ్ కేకలెయ్
ఫేమస్ పాప్ సింగర్ వి కావచ్చురోయ్
రాత్రంతా టీ తాగి తెగ
చదివేసేమవుతావురోయ్.. జీరో.. జీరో.. జీరో

     
క్లాసు రూములో తపస్సు చేయుట వేస్ట్ రా గురూ.. ఆహా
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ.. ఆహా
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ.. ఆహా
అందుకే నువు ప్రతీ క్షణాన్ని అందుకో గురు.. ఆహా

కాలేజిలో మహరాజులు  గేటు దాటాక ప్రజలౌదురూ
క్లాసు రూములో తపస్సు చెయ్యుట వేస్ట్ రా గురూ
బయట వున్నది ప్రపంచమన్నది చూడరా గురూ