Showing posts with label ఏ.ఆర్. రెహమాన్. Show all posts
Showing posts with label ఏ.ఆర్. రెహమాన్. Show all posts

Tuesday, August 6, 2013

నిన్న ఈ కలవరింత లేదు లే


చిత్రం: పద్మవ్యూహం (1993)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: హారిక


పల్లవి:

    నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
    ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
    హృదయం కరిగిపోయెనా ఓ మనసా...
    నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
    ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
    హృదయం కరిగిపోయెనా ఓ మనసా...

చరణం 1:

    దైవం ఉందంటిని అమ్మనెరిగాకనే కలలు నిజమంటిని ఆశ కలిగాకనే
    ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
    పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
    సృష్టి ఉన్నంత దాకా ప్రేమలే శాశ్వతం
    నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
    ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
    హృదయం కరిగిపోయెనా ఓ మనసా
    నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే

చరణం 2:

    నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే మాట లేకున్నను భాష ఉంటుందిలే
    ప్రేమయే లేకపోతే జీవితం లేదులే
    వాసనే లేకనే పూలు పూయొచ్చులే ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
    బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే

    నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
    ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
    హృదయం కరిగిపోయెనా ఓ మనసా 
    నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
    ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
    హృదయం కరిగిపోయెనా ఓ మనసా... 

జూలై మాసం వస్తే తోడు చేరు వయసు


చిత్రం: పద్మవ్యూహం (1993)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: మనో, అనుపమ



పల్లవి:

    జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
    సందెవేళ వస్తే పాట పాడు మనసు
    సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
    కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

    జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
    సందెవేళ వస్తే పాట పాడు మనసు
    సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
    కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

చరణం 1:

    నింగినెగిరిపోదామా రాచిలకల రెక్కను అడగాలి
    అర్ధరాత్రి విడిదికని జాబిల్లిని చోటే అడగాలి
    గాలి దేవుని తోడడిగీ చూద్దామా దేశాలే
    అడవి తల్లిని మాటడిగీ కడదామా గూడొకటి

    అడగగానే చెయ్యదే గాలి మనకి సాయం
    ప్రేమ అన్నది సర్వదా సర్వతేజా సత్యం

    జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
    సందెవేళ వస్తే పాట పాడు మనసు
    సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
    కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

    జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
    సందెవేళ వస్తే పాట పాడు మనసు

చరణం 2:

    కొత్త కాదే ముద్దంటే ఇక భూతక వేషం వేయొద్దే
    మనసు సర్వం నా సొంతం అది ఊసులతోనూ దాచొద్దే
    కథలు పలికే పానుపిది కన్నీరే ఒద్దంట
    ఆదమరచి ఐ లవ్ యూ చెప్పాలి నువ్వంట

    అంతులేని ప్రేమిది నీకు నాకు యోగం
    తోటి బాసల సాటులో పంచుకుందాం భాగం


    జూలై మాసం వస్తే తోడు చేరు వయసు
    సందెవేళ వస్తే పాట పాడు మనసు
    సిగ్గనేది ఎప్పుడో పాత కాలం మాట
    కోటి ముద్దులు కోరవా కలలు పొంగే పూట

కన్నులకు చూపందం


చిత్రం: పద్మవ్యూహం (1993)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

    కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
    తీగకే పూలందం... వారికే నేనందం
    కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
    తీగకే పూలందం... వారికే నేనందం
    కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
    తీగకే పూలందం... వారికే నేనందం

చరణం 1:

    వానాగిపోయిననూ ఆకుపై చుక్కందం
    అల చెదిరిపోయిననూ దరినున్న నురుగందం
    చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
    చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
    శ్రీవారి చూపులకు ఎప్పుడు నేనందం

చరణం 2:

    అందాల వన్నెలకే అపురూప కురులందం
    అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం
    మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
    మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
    నా తోడు నీవుంటే చీకటే ఓ అందం

కన్నులకు చూపందం


చిత్రం: పద్మవ్యూహం (1993)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: బాలు


పల్లవి:

    కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
    చిరునవ్వు చెలికందం... సిరిమల్లి సిగకందం
    కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
    చిరునవ్వు చెలికందం... సిరిమల్లి సిగకందం
    కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
    చిరునవ్వు చెలికందం... సిరిమల్లి సిగకందం

చరణం 1:

    కిరణాలు రవికందం... సెలయేరు భువికందం
    మగువలకు కురులందం... మమతలకు మనసందం
    పుత్తడికి మెరుపందం... పున్నమికి శశి అందం
    పుత్తడికి మెరుపందం... పున్నమికి శశి అందం
    నాదాలు శృతికందం... రాగాలు కృతికందం

చరణం 2:

    వేకువకు వెలుగందం... రేయంత అతివందం
    వేసవికి వెన్నెలందం... ఆశలకు వలపందం
    తలపులే మదికందం... వయసుకే ప్రేమందం
    తలపులే మదికందం... వయసుకే ప్రేమందం
    పాటకే తెలుగందం... శ్రీమతికి నేనందం

Tuesday, July 23, 2013

అంజలి అంజలి పుష్పాంజలి

చిత్రం: డ్యుయెట్ (1991)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: వెన్నెలకంటి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

లాలలా లాలలా... లాలాలలా...
లాలలా లాలలా... లాలాలలా...
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

చరణం 1:

నిన్నదాక నువ్వునేను ఇరువురం ఎవరనీ
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మదియిదీ
కరిగిన సిరిమోజులా కథ ఇది నాచెలి
ఎదురుగ తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధుకావ్యం పలికినది

అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

చరణం 2:

కన్నుల సంకేతమె కలలకు తొలకరి
వెన్నెల జలపాతమె వలపుకు తదుపరి
గుండెలో సంగీతమె కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చిలువుగ ఎదమారె మధువనిగా
అమవస నిశిమారే వెన్నెలగా

అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గాన మాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవియైన నీ మదికి కవితాంజలి

చరణం 3:

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువు లేనిదే కలలే రావులే
నా మది నువు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవైన వలపువని

అంజలి అంజలి వలపు లతాంజలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

Tuesday, July 16, 2013

కొంటెగాణ్ణి కట్టుకో

చిత్రం: జెంటిల్ మాన్ (1993)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా

తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు
సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా

చరణం 1:

అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే
అందరిని దోచే దొంగ నేనేలే
నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

చిన్నారి మైనా చిన్నదానా
నే గాలం వేశానంటే పడితీరాలెవరైనా
బంగారమంటి సింగారం నీదే
అందం సొంతమైతే లేనిదేది లేదే

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా

చరణం 2:

ఆఁ... కొనచూపుతోనే వేశావు బాణం
రేపావు నాలో నిలువెల్ల దాహం
కొరగాని వాడితో మనువు మహఘోరం
ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం
చిగురాకు పరువం సెగ రేగే అందం
నీకు కానుకంట ప్రతిరోజు పండగంట

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుకేసి చుట్టుకో
కోటి వన్నెలున్నదానా
అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో
వాలుకళ్ళ పిల్లదానా

Friday, June 21, 2013

ప్రియా ప్రియా చంపొద్దే

చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ. ఎం. రత్నం, శివగణేశ్
నేపధ్య గానం: శ్రీనివాస్, బృందం

పల్లవి:

అహ..అహా..ఆ..ఆ..ఆ
అహ..అహ..ఆ..ఆ..
ప్రియా ప్రియా చంపొద్దే... నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే ..
అయ్యో వనెలతో... ప్రాణం తీయొద్దే
ప్రియా.. ప్రియా.. చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే

చరణం 1:

చెలియా నీదు నడమును చూశా.. అరెరే బ్రహ్మింత పిసనారి
తలపెకైత్త కళ్లు తిరిగిపోయే.. ఆహా.. అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కుంచెగా మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడగుల శిల ఆరడుగుల శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టినా స్ర్తీలందరిలో... నీవే నీవే అందమటా
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట ఘోరమటా..

ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే..

చరణం 2:

అందమైన పువ్వా..పువ్వా.. చెలి కురులు సొగసు తెలిపేనా
అందమైన నదివే నదివే.. చెలి మీటి సొగసు తెలిపేనా
అందమైన గొలుసా గొలుసా.. కాలి సొగసు తెలిపేనా
అందమైన మణివే మణివే.. గుండె గుబులు తేలిపేనా

అహ..ఆ...ఆఅ....
ఆహా...ఆ...ఆ...

చంద్రగోళంలో ఆక్సిజిన్ నింపి..అక్కడ నీకొక గుడి కడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు..నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి..నిను జోకొడతా
నిద్దురలోన చెమటలు పడితే.. నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగా.. మంచు బిందువలే సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును... గంగాజలముగ సేవిస్తా...

ప్రియా ప్రియా చంపొద్దే..
ప్రియా ప్రియా చంపొద్దే... నవ్వీ నన్నే ముంచొద్దే
అహ..హా..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ.ఆ

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం

చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: శివ గణేష్
నేపధ్య గానం: సుజాత, ఉన్నికృష్ణన్

పల్లవి:

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం

ఆ గిరులు... ఈ తరులు ...ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం....

తారారరరా....తారారరరా....తారారరరా...రా...ఓ...
తారారరరా...తారారరరా....తారారరరా...రా...ఓ..

చరణం 1:

ఏ వాసనలేని కొమ్మలపై...సువాసన కలిగిన పూలున్నాయి
పూలవాసన.... అతిశయమే...
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో...ఒక చిటికడైనా ఉప్పుందా
వాన నీరు ...అతిశయమే....

విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా...వెలిగేటి మిణుగురులు...అతిశయమే
తణువున ప్రాణం ఏ చోటనున్నదో...
ప్రాణంలో ప్రేమ ఏ చోటనున్నదో...ఆలోచిస్తే... అతిశయమే

ఆ గిరులు... ఈ తరులు... ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం

చరణం 2:

అల వెన్నెలంటి ఒక దీవి...ఇరు కాళ్ళవెంట నడిచొస్తే
నీవేనా ...అతిశయమే..

జగమున అతిశయాలు ఏడేనా... ఓ మాట్లడే పువ్వా నువు... ఎనిమిదొవ అతిశయమూ..
నింగిలాంటి నీ కళ్ళూ ...పాలుగారే చెక్కిళ్ళు... తేనెలూరే అధరాలు ..అతిశయమూ

మగువా చేతివేళ్ళు ...అతిశయమే
మకుటాల్లాంటి గోళ్ళు ...అతిశయమే
కదిలే వంపులు ...అతిశయమే...

ఆ గిరులు... ఈ తరులు... ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా ....అతిశయం..ఓ..
పదహారు ప్రాయన పరువంలో
అందరికి పుట్టేటి ప్రేమేగా ....అతిశయం..ఓ...

పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో... అతిశయం
ఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో... అతిశయం
వేణువులో గాలి సంగీతాలే... అతిశయం
గురువ్వెవరు లేని కోయిల పాటే ...అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీ మేనే ...అతిశయం
తారారరరా...తారారరరా....తారారరరా...రా...ఓ..
తారారరరా....తారారరరా...తారారరరా...రా..ఓ..

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు

చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఎ.ఎం.రత్నం, శివగణేష్
నేపధ్య గానం: ఎ.ఆర్.రెహమాన్, బృందం

పల్లవి:

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు

శని ఆదివారాల్లేవని అన్నవీ.. ఓహో..మనుషుల్ని మిషన్‌లు కావద్దన్నవీ
చంపే సైన్యమూ అణు ఆయుధం.. ఆకలి పస్తులు డర్టీ పాలిటిక్స్
పొల్యూషన్ ఏదీ చొరబడ లేని.. దీవి కావాలి ఇస్తావా కొలంబస్ !

చరణం 1:

వారం ఐదునాళ్ళు.. శ్రమకే జీవితం
వారం రెండునాళ్ళు.. ప్రకృతికి అంకితం
వీచేగాలిగ మారి పూవులనే కొల్లగొట్టు.. మనస్సులు చక్కబెట్టు..
మళ్లీ పిల్లలలోకం మన వెంట రానీ
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే.. ఒంటికి తొడిగి పెకైగురూ
పక్షులకెన్నడూ పాస్‌పోర్ట్ లేదు.. ఖండాలన్నీ దాటెళ్ళూ
నేడు విరామమేగవద్దు..అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణా చేపలల్లే ఈదుదాం... కొలంబస్...!

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు
కొలంబస్...!

చరణం 2:

నడిచేటి పూలను కొంచెం చూడు.. నేడైనా మడిమణిగాను లవ్వరైతే లేదు
అల నురగలు తెచ్చి.. చెలి చీరే చెయ్యరారాదా
నెలవంకను గుచ్చి.. చెలి మెడలో వెయ్యరారాదా
వీకెండు ప్రేయసి.. ఓకే అంటే ప్రేమించు..టైంపాసింగ్ ప్రేమలా..
పూటైనా ప్రేమించు.. వారం రెండునాళ్ళు వర్థిల్లగా... కొలంబస్...!

కొలంబస్ కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి
సెలవు సెలవు సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు .. కనుగొను కొత్త దీవి నీవు
కొలంబస్...!
సెలవు సెలవు సెలవు .. కనుగొను కొత్త దీవి నీవు
సెలవు సెలవు సెలవు .. కనుగొను కొత్త దీవి నీవు
కొలంబస్...!

కన్నులతో చూసేది గురువా

చిత్రం: జీన్స్ (1998)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
గీతరచయిత: ఏ. ఏం. రత్నం
నేపధ్య గానం: నిత్యశ్రీ

పల్లవి:

పా పమపని పమపని పమగమ ప
సగసని పనిపమ గమగస గా
పమపని పమపని పమగమ ప
సగ సని పని పమ గమ గస గమ

తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం

కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కను వీడిపోలేవు...ఇక నను వీడిపోలేవు

తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం

చరణం 1:

జల జల జల...జంటపదాలు
గల గల గల...జంటపదాలు
ఉన్నవిలే... తెలుగులో ఉన్నవిలే....
విడదీయుటయే న్యాయం కాదు...
విడదీసేస్తే వివరం లేదు...
రెండేలే ...రెండు... ఒకటేలే...

ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం

రేయి పగలు రెండైనా...రోజు మాత్రం ఒకటేలే
కాళ్ళు ఉన్నవి రెండైనా...పయనం మాత్రం ఒకటేలే
హృదయాలన్నవి రెండైనా...ప్రేమ మాత్రం ఒకటేలే...

కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...

చరణం 2:

తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం
తకిట తకిట తకధిం తకిట తకిట తకధిం
తకిట తకిట తకధిం తక ఝం

క్రౌంచ పక్షులు జంటగ పుట్టును...జీవితమంతా జతగా బ్రతుకును
విడలేవు... వీడి మనలేవు...
కన్ను కన్ను జంటగ పుట్టును...ఒకటేడిస్తే రెండోది ఏడ్చును
పోంగేనా... ప్రేమే చిందేనా...

ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం
ధినకు ధినకు ధిన ధిం ధిం తాన
నాదిరి దాని తోందిరి దాని దినథోం

ఒక్కరు పోయే నిద్దురలో...ఇద్దరు కలలను కంటున్నాం
ఒక్కరు పీల్చే శ్వాసనలో...ఇద్దరు జీవనమంటున్నాం
తాళి కొరకు మాత్రమే...విడి విడిగా వెతుకుతున్నాం...

మమ గగ మమ సస గగ సస గగ నిని
సగగ సమమ సగగ సపప సగగ సనిని సగస సానిదపమ గా
గమపనిస గారిదా సానిదపా మగారి సగమ
కన్నులతో చూసేదీ గురువా

పపనినిసా గగ గమమ పపనినిసాద
సగమ పనిదపమా గా మపని గరిదని నిదమగరిగ నిద
కన్నులతో చూసేదీ గురువా...ఆ....

రీరీస నిస రిరిస ససరి నినిగగా గరిద నిగ గరిదా నిదపమా
నిదపమ గరిస నిసగా సగమ గమ పా నిదప మపని సపనిస
గరిసా గరిసని సాని దపామ గమప మా

కన్నులతో చూసేది...గురువా...
కనులకు సొంతమౌనా...కనులకు సొంతమౌనా...
కన్నుల్లో కనుపాపై ...నీవు...
కను వీడిపోలేవు...ఇక నను వీడిపోలేవు

Tuesday, August 21, 2012

శశి వదనే శశి వదనే

చిత్రం: ఇద్దరు (1997) 
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్ 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: ఉన్ని కృష్ణన్, బోంబే జయశ్రీ 

పల్లవి: 

శశి వదనే శశి వదనే ..స్వర నీలంబరీ నీవా 
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావ 
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 

నవ మదనా నవ మదనా కలపకు కన్నుల మాట 
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువ కు మురిసిన బాట 
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా 

చరణం 1: 

మదన మోహినీ చూపు లోన మాండు రాగ మేలా 
మదన మోహినీ చూపు లోన మాండు రాగ మేలా 
పడుచువాడిని కన్న వీక్షణ పంచదార కాదా 
కల ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం 
కల ఇలా మేఘమాసం క్షణానికో తోడి రాగం 
చందనం కలిసిన ఊపిరిలో కరిగే లేఖల కటినీఇల్లే 

శశి వదనే శశి వదనే ..స్వర నీలంబరీ నీవా 
అందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగా రావ 
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 

చరణం 2: 

నెయ్యం వియ్యం ఏదేలైనా తనువు నిలువ దేలా 
నెయ్యం వియ్యం ఏదేలైనా తనువు నిలువ దేలా 
నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికేనేలా 
ఒకే ఒక చైత్ర వీణ పురే విడి పూతలాయె 
ఒకే ఒక చైత్ర వీణ పురే విడి పూతలాయె 
అమృతం కురిసిన రాతిరిలో జాబిలి హృదయం జత చేరే 

నవ మదనా నవ మదనా కలపకు కన్నుల మాట 
శ్వేతాశ్వమ్ముల వాహనుడా విడువ కు మురిసిన బాట 
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గిచ్చే మోజు మోహనమే నీదా 
అచ్చొచ్చెటి వెన్నెలలో విచ్ఛందాలు నవ్వగానే గుచ్చెత్తేటి కులుకు సిరి నీదా 

ఆ... నీదా 
ఆ..... నీదా... 
ఆ........నీదా.....