Showing posts with label కన్నవారిల్లు (1978). Show all posts
Showing posts with label కన్నవారిల్లు (1978). Show all posts
Saturday, September 5, 2020
మూడుముళ్లు పడిన నాడే
చిత్రం : కన్నవారిల్లు (1978)
మూడుముళ్లు పడిన నాడే
సంసారమంటే సంగీతమే...ఆ... ఆ... ఆ.. ఆ..
మూడుముళ్లు పడిన నాడే
చీకటిలో బిగికౌగిలిలో చిమచిమలాడింది
నిలువు దోపిడి చెేయాలంటే జాబిలి చూడని కౌగిలి అందం
గుసగుసల తేలి ఘుమఘమల సోలి సందిటను వాలి
అనురాగమంత చెలరేగినంత ఆలాపనైపోయి
రాతకొద్ది దొరికాడు రాజకీయనాయకుడు
అయ్యొరామ... దొరగారికి తీరికేది
అయితే బావ మనమిక సుఖపడనేరం
Labels:
(క),
ఆదినారాయణరావు,
కన్నవారిల్లు (1978),
బాలు,
రామకృష్ణ,
వేటూరి,
సుశీల
Tuesday, September 1, 2020
విరిసిన ఆనంద దీపావళి
చిత్రం : కన్నవారిల్లు (1978)
సంగీతం : ఆదినారాయణరావు
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
చరణం 1 :
కన్నులలోన వెన్నెల వాన
కౌగిలిలోన గారాల కూన
మా పాటకు పల్లవి మీరు
మా తోటకు మల్లెలు మీరు
మా కంటికి దివ్వెలు మీరు
మా పండగనవ్వులు మీరు
చీకటివాకిట ముగ్గుల ముంగిట దీపాలే మీరు
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
చరణం 2 :
తామరపువ్వు తమ్ముడి నవ్వు
కానుక మాకు కావాలి ఇవ్వు
పండుగ వచ్చేయేడు మాతోడుగ వాడుంటాడు
పూవత్తులు వెలిగిస్తాడు పున్నమలే పండిస్తాడు
చుక్కల పందిట అక్కల సందిట జాబిల్లే వాడు
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
చరణం 3 :
పిల్లల నోట చల్లని మాట
పండగ పూట రతనాల మూట
ఈ పాపల కోరికలన్ని మా పాలిటి దీవెనలైతే
ఆ నింగిని తారకలన్ని మాయింటికి దీపాలైతే
రేపులు మాపులు దేవుని చూపులు చల్లనివే మనకు
విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8054
Tuesday, September 11, 2012
గడసరి అమ్మాయి
|
చిత్రం: కన్నవారిల్లు (1978) సంగీతం: ఆదినారాయణరావు నేపథ్య గానం: బాలు, సుశీల పల్లవి : గడసరి అమ్మాయి... నడుమొక సన్నాయి గడసరి అమ్మాయి... నడుమొక సన్నాయి చేతికంది చిలిపిగ కదిలిన వేళలో... ఏమౌను... మరేమౌను... ఎదలో సరిగమలెదురవును అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి కన్నెపిల్ల కనులను కదిపిన వేళలో... ఏమౌను... మదేమౌను... ఎదలో తకధిమి మొదలౌను చరణం 1 : ఏవో ఏవో కలలే... వస్తుంటే.. వస్తుంటే... ఆ కలలే విరులై వలపుల రెమ్మల పూస్తుంటే... విరబూస్తుంటే... నీవే నీవే కలగా వస్తుంటే... వస్తుంటే... ఆ కలలో జల్లుగ.. తొలకరి వెన్నెల పడుతుంటే... గిలి పెడుతుంటే... ఏమౌను... మరేమౌను... రేయికి నిదురే కరువౌను అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి కన్నెపిల్ల కనులను కదిపిన వేళలో... ఏమౌను... మదేమౌను... ఎదలో తకధిమి మొదలౌను ఆహ...హ...అహ...హ...ఓహొ..హో ఆహ..హ..అహ...హా...లలలల...లా... చరణం 2 : మనసు మనసు లతలై పెనవేస్తే... పెనవేస్తే... ఆ అల్లిక కోసం పెళ్ళి ముహూర్తం తలపెడితే... అది త్వరపెడితే... ఆలుమగలై ఒకటై.. మనముంటే... మనముంటే నీ ఒడిలో బాబు బుడిబుడి నవ్వులు వినబడితే... నను నిలబెడితే... ఏమౌను... మరేమౌను... మళ్ళీ పల్లవి మొదలౌను... అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి కన్నెపిల్ల కనులను కదిపిన వేళలో... ఏమౌను... మదేమౌను... ఎదలో తకధిమి మొదలౌను https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8053 | |
Subscribe to:
Posts (Atom)


