Tuesday, September 11, 2012

గడసరి అమ్మాయి




చిత్రం: కన్నవారిల్లు (1978)
సంగీతం: ఆదినారాయణరావు
నేపథ్య గానం: బాలు, సుశీల

పల్లవి :



గడసరి అమ్మాయి... నడుమొక సన్నాయి
గడసరి అమ్మాయి... నడుమొక సన్నాయి
చేతికంది చిలిపిగ కదిలిన వేళలో...
ఏమౌను... మరేమౌను...
ఎదలో సరిగమలెదురవును


అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి
అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి
కన్నెపిల్ల కనులను కదిపిన వేళలో...
ఏమౌను... మదేమౌను...
ఎదలో తకధిమి మొదలౌను


చరణం 1 :



ఏవో ఏవో కలలే... వస్తుంటే.. వస్తుంటే...
ఆ కలలే విరులై వలపుల రెమ్మల పూస్తుంటే...
విరబూస్తుంటే...



నీవే నీవే కలగా వస్తుంటే... వస్తుంటే...
ఆ కలలో జల్లుగ.. తొలకరి వెన్నెల పడుతుంటే...
గిలి పెడుతుంటే...
ఏమౌను... మరేమౌను...
రేయికి నిదురే కరువౌను



అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి
కన్నెపిల్ల కనులను కదిపిన వేళలో...
ఏమౌను... మదేమౌను...
ఎదలో తకధిమి మొదలౌను


ఆహ...హ...అహ...హ...ఓహొ..హో
ఆహ..హ..అహ...హా...లలలల...లా...



చరణం 2 :



మనసు మనసు లతలై పెనవేస్తే... పెనవేస్తే...
ఆ అల్లిక కోసం పెళ్ళి ముహూర్తం తలపెడితే...
అది త్వరపెడితే...



ఆలుమగలై ఒకటై.. మనముంటే... మనముంటే
నీ ఒడిలో బాబు బుడిబుడి నవ్వులు వినబడితే...
నను నిలబెడితే...
ఏమౌను... మరేమౌను...
మళ్ళీ పల్లవి మొదలౌను...



అల్లరి అబ్బాయి... ఒల్లంత బడాయి
కన్నెపిల్ల కనులను కదిపిన వేళలో...
ఏమౌను... మదేమౌను...
ఎదలో తకధిమి మొదలౌను





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8053


No comments:

Post a Comment