Showing posts with label సిరిమల్లె నవ్వింది (1980). Show all posts
Showing posts with label సిరిమల్లె నవ్వింది (1980). Show all posts

Friday, September 18, 2020

ఈడొస్తే ఇంతేనమ్మొ

 



చిత్రం : సిరిమల్లె నవ్వింది (1980)

సంగీతం : కె.వి. మహదేవన్ 

గీతరచయిత :  

నేపథ్య గానం :  శైలజ    




పల్లవి :


ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది... ళో ళో ళో... ళో ళో ళో

ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది...


చెయ్యెస్తే చెలగాటం చెప్పలేని మొహవాటం

ఆగదమ్మ ఆరాటం అందమైన పోరాటం


ఈడొస్తే ఇంతేనమ్మొ... 



చరణం 1 :


కోరికతో కొంకర్లు తిరిగి తిరిగిపోతుంటే

వలపులతో వంకర్లు పెరిగిపెరిగి పోతుంటే

కోరికతో కొంకర్లు తిరిగి తిరిగిపోతుంటే

వలపులతో వంకర్లు పెరిగిపెరిగి పోతుంటే


ఊపిరిలో చలి కౌగిలిలో గిలి 

ఊపిరిలో చలి కౌగిలిలో గిలి 


కలిసిమెలిసి చక్కలిగిలి గిలిగిలిగిలిగుంటె

ఏందమ్మొ... హా హా హా హా హా... ఇది ఏందమ్మొ


ఓణీలేసినాక వంకర తిరగాల్సిందేనన్నారు

బహ్మంగారు ఎపుడో 


ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది...



చరణం 2 : 


కౌగిట్లో కన్నెవయసు కరిగికరిగిపోతుంటే

గుప్పెట్లో ఉన్న మనసు ఎగిరి ఎగిరి పోతుంటే

ఇద్దరికి ముడి ముద్దులతోపడి  

పడచువయసు సరిగమపద పదపదమంటుంటే 

ఏందమ్మొ హా హా హా హా హా... ఇది ఏందమ్మొ


అందాక వచ్చినాక అవతల ఒడ్డేనన్నారు వేమనగారు ఎపుడో



ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది... ళో ళో ళో...



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3315

ఒక పువ్వు పూచింది





చిత్రం : సిరిమల్లె నవ్వింది (1980)

సంగీతం : కె.వి. మహదేవన్ 

గీతరచయిత :  

నేపథ్య గానం :  సుశీల 



పల్లవి :


ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది

ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది

తన సామి రాగానే తన్మయం చెందింది

తన సామి రాగానే తన్మయం చెందింది


ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది



చరణం 1 :


కొమ్మలవూగి రెమ్మలదాగి 

పైకి వెదజల్లేపరిమళము దేనికని

ఏ చోట ఉన్నా ఏ తోటనున్నా 

ఆ తీపికబురుతో ప్రియుని పిలవాలని... 

తన జన్మపెన్నిధిని పొందాలని


ఒక పువ్వు పూచింది



చరణం 2 :


జీవన ఆమని రూపము నీవని 

చిగురులు వేసెను ఈ వనము ఈ క్షణము

మన్మధ భావమై మంగళ రావమై 

ముచ్చటగా పెళ్లి జరగాలని... 

తారలే తలంబ్రాలు కావాలని


ఒక పువ్వు పూచింది దేవునికై వేచింది



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3312


ఏ అమ్మ కూతురో

 




చిత్రం : సిరిమల్లె నవ్వింది (1980)


సంగీతం : కె.వి. మహదేవన్ 


గీతరచయిత :  


నేపథ్య గానం : బాలు, సుశీల 




పల్లవి :




ఏ అమ్మ కూతురో మా అత్త కూతురై

జాజిపూల జలకడమాడ వస్తుందని

అనుకున్నానా... వినుకొన్నానా

అనుకున్నదే అవుతుందనుకున్నానా


ఏ కొంటెపిల్లడో మా ఇంటికల్లుడై

మల్లెపూల మబ్బు నీడ తెస్తాడని

అనుకున్నానా... వినుకొన్నానా

అనుకున్నదే అవుతుందనుకున్నానా 

ఏ అమ్మ కూతురో...

ఏ కొంటెపిల్లడో...


చరణం 1 :


ఏరల్లే నీరల్లే ఏకమై పోతుంటే... పోతుంటే 

పోతుంటే

ఏరంటి మన ఈడే ఏల్లువై పోతుంటే పోతుంటే

పోతుంటే


ఏరల్లే నీరల్లే ఏకమై పోతుంటే... పోతుంటే 

ఏరంటి మన ఈడే ఏల్లువై పోతుంటే... పోతుంటే


ఏరంతా కెరటాలు... మన జంట సరదాలు

ఏరంతా కెరటాలు... మన జంట సరదాలు

ఏలలే పాడుతూ గాలిలో తేలుతూ

పూలలో వాలుతూ పులకరించి పోతుంటే



ఏ అమ్మ కూతురో...

ఏ అమ్మ కూతురో...


చరణం 2


ఎన్నెలే కోకల్లెకట్టి నువ్వస్తుంటే వస్తుంటే

చుక్కలే చూపులై నా వంకే చూస్తుంటే చూస్తుంటే


ఏలా మోమాటాలు... మనకేలా పరదాలు

తేనెలా వానలో తీయని వరదలో

వణుకుతూ తేలుతూ ముద్దాడవస్తుంటే


ఏ కొంటెపిల్లడో మా ఇంటికల్లుడై

మల్లెపూల మబ్బు నీడ తెస్తాడని

అనుకున్నానా... వినుకొన్నానా

అనుకున్నదే అవుతుందనుకున్నానా 


లాలలలల్ల్లా... లాలాలలాలలా




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3984