Friday, September 18, 2020

ఈడొస్తే ఇంతేనమ్మొ

 



చిత్రం : సిరిమల్లె నవ్వింది (1980)

సంగీతం : కె.వి. మహదేవన్ 

గీతరచయిత :  

నేపథ్య గానం :  శైలజ    




పల్లవి :


ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది... ళో ళో ళో... ళో ళో ళో

ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది...


చెయ్యెస్తే చెలగాటం చెప్పలేని మొహవాటం

ఆగదమ్మ ఆరాటం అందమైన పోరాటం


ఈడొస్తే ఇంతేనమ్మొ... 



చరణం 1 :


కోరికతో కొంకర్లు తిరిగి తిరిగిపోతుంటే

వలపులతో వంకర్లు పెరిగిపెరిగి పోతుంటే

కోరికతో కొంకర్లు తిరిగి తిరిగిపోతుంటే

వలపులతో వంకర్లు పెరిగిపెరిగి పోతుంటే


ఊపిరిలో చలి కౌగిలిలో గిలి 

ఊపిరిలో చలి కౌగిలిలో గిలి 


కలిసిమెలిసి చక్కలిగిలి గిలిగిలిగిలిగుంటె

ఏందమ్మొ... హా హా హా హా హా... ఇది ఏందమ్మొ


ఓణీలేసినాక వంకర తిరగాల్సిందేనన్నారు

బహ్మంగారు ఎపుడో 


ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది...



చరణం 2 : 


కౌగిట్లో కన్నెవయసు కరిగికరిగిపోతుంటే

గుప్పెట్లో ఉన్న మనసు ఎగిరి ఎగిరి పోతుంటే

ఇద్దరికి ముడి ముద్దులతోపడి  

పడచువయసు సరిగమపద పదపదమంటుంటే 

ఏందమ్మొ హా హా హా హా హా... ఇది ఏందమ్మొ


అందాక వచ్చినాక అవతల ఒడ్డేనన్నారు వేమనగారు ఎపుడో



ఈడొస్తే ఇంతేనమ్మొ... ఇల్లు పీకి పందిరేస్తది

గిల్లి జోలపాడుతుంటది... ళో ళో ళో...



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3315

No comments:

Post a Comment