చిత్రం : సిరిమల్లె నవ్వింది (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఏ అమ్మ కూతురో మా అత్త కూతురై
జాజిపూల జలకడమాడ వస్తుందని
అనుకున్నానా... వినుకొన్నానా
అనుకున్నదే అవుతుందనుకున్నానా
ఏ కొంటెపిల్లడో మా ఇంటికల్లుడై
మల్లెపూల మబ్బు నీడ తెస్తాడని
అనుకున్నానా... వినుకొన్నానా
అనుకున్నదే అవుతుందనుకున్నానా
ఏ అమ్మ కూతురో...
ఏ కొంటెపిల్లడో...
చరణం 1 :
ఏరల్లే నీరల్లే ఏకమై పోతుంటే... పోతుంటే
పోతుంటే
ఏరంటి మన ఈడే ఏల్లువై పోతుంటే పోతుంటే
పోతుంటే
ఏరల్లే నీరల్లే ఏకమై పోతుంటే... పోతుంటే
ఏరంటి మన ఈడే ఏల్లువై పోతుంటే... పోతుంటే
ఏరంతా కెరటాలు... మన జంట సరదాలు
ఏరంతా కెరటాలు... మన జంట సరదాలు
ఏలలే పాడుతూ గాలిలో తేలుతూ
పూలలో వాలుతూ పులకరించి పోతుంటే
ఏ అమ్మ కూతురో...
ఏ అమ్మ కూతురో...
చరణం 2
ఎన్నెలే కోకల్లెకట్టి నువ్వస్తుంటే వస్తుంటే
చుక్కలే చూపులై నా వంకే చూస్తుంటే చూస్తుంటే
ఏలా మోమాటాలు... మనకేలా పరదాలు
తేనెలా వానలో తీయని వరదలో
వణుకుతూ తేలుతూ ముద్దాడవస్తుంటే
ఏ కొంటెపిల్లడో మా ఇంటికల్లుడై
మల్లెపూల మబ్బు నీడ తెస్తాడని
అనుకున్నానా... వినుకొన్నానా
అనుకున్నదే అవుతుందనుకున్నానా
లాలలలల్ల్లా... లాలాలలాలలా
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3984
No comments:
Post a Comment