Showing posts with label Jagayya. Show all posts
Showing posts with label Jagayya. Show all posts

Wednesday, August 8, 2018

ఓహో గులాబి బాలా

చిత్రం:  మంచిమనిషి (1964)
సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు/టి. చలపతిరావు
గీతరచయిత:  దాశరథి 
నేపథ్య గానం:  పి. బి. శ్రీనివాస్ 


పల్లవి :


ఓ గులాబీ... ఓ గులాబీ
వలపు తోటలో విరిసిన దానా..
లేత నవ్వులా  వెన్నెల సోనా..


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా 
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో 


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 



చరణం 1 :


కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
కొంటె తుమ్మెదలవలెచెవూ... తుంటితేనెలందించెవూ..
మోసం చేసీ మీసం దువ్వే మోసకారులకు లోంగేవూ... లోంగేవూ..



ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా..



చరణం 2 :



రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రూపం చూసీ వస్తారు... చూపులగాలం వేస్తారు
రేకులుచిదిమీ... సొగసులు నునిమీ..
చివరకు ద్రోహం చేస్తారు... చివరకు ద్రోహం చేస్తారు


ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 
సొగసైన కనులదానా... సొంపైన మనసుదానా 
నీ వారెవరో తెలుసుకో... తెలుసుకో..తెలుసుకో 
ఓహో గులాబి బాలా... అందాల ప్రేమ మాలా 







Thursday, February 27, 2014

గున్నమామిడీ కొమ్మమీద

చిత్రం  :  బాలమిత్రుల కథ (1973)
సంగీతం  : సత్యం
గీతరచయిత  : సినారె
నేపథ్య గానం : జానకి



పల్లవి:


గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండుండేవి
గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండుండేవి
ఒక గూటిలోన చిలకుండేది...
ఒక గూటిలోన కోయిలుండేది... 

గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండుండేవి


చరణం 1:

తీగలాగ అల్లిన చెలిమీ.. తెగుతుందని దిగులుపడి
కొమ్మవిడిన ఆ జంట కొత్త గూడు చేరింది 
తీగలాగ అల్లిన చెలిమీ.. తెగుతుందని దిగులుపడి
కొమ్మవిడిన ఆ జంట కొత్త గూడు చేరింది 

ఒక్కనాడు రామచిలక ఉక్కుడేగ నీడకు జడిసి
కోయిలతో చెప్పలేక గూడు విడిచిపోయింది...
జోడు చెదిరి పోయింది...


గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండుండేవి


చరణం 2:


చిన్ని చిలక ఏదనీ కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది.. కుమిలి కుమిలి ఏడుస్తుంది
చిన్ని చిలక ఏదనీ కన్నతల్లి అడిగితే
కోయిలేమి బదులిస్తుంది.. కుమిలి కుమిలి ఏడుస్తుంది


కోనకోనలో తిరిగీ..  కొమ్మ కొమ్మనూ అడిగీ
కొదమ చిలక కనరాకుంటే... కోయిలగతి ఏమవుతుంది
గుండె పగిలి చస్తుంది..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6524