Tuesday, December 11, 2012

కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా

చిత్రం: గూడుపుఠాణీ (1972)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

కన్నులైనా తెరవని ఓ చిన్ని పాపా స్వాగతం
ఊహలింకా తెలియని నా చిట్టీ పాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం.. స్వాగతం..

చరణం 1:

లోకమంతా శాంతి చిందిన ..లే గులాబి లేదులే
మానవతకై ప్రాణమిచ్చిన...బోసినవ్వే లేదులే
లోకమంతా శాంతి చిందిన ..లే గులాబి లేదులే
మానవతకై ప్రాణమిచ్చిన...బోసినవ్వే లేదులే...

పూల మాదిరి మెరిసి పోయే..ముళ్ళ బాటలే మిగిలెనే
నవ్వు చాటున బుసలు కొట్టే..నాగు పాములే మిగిలెనే
నేటి లోకం అసలు రూపం...నీవు చూసేదెప్పుడో
నీకు తెలిసేదెన్నడో...

కన్నులైనా తెరవని ...ఓ చిన్ని పాపా స్వాగతం...
ఊహలింకా తెలియని నా చిట్టీ పాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం.. స్వాగతం..

చరణం 2:

జాతి కోసం బలైపోయిన ...నేత నేడిక లేడులే
జగతిలో మన కీర్తీ పెంచిన..విశ్వకవి లేడాయెనే
జాతి కోసం బలైపోయిన ...నేత నేడిక లేడులే
జగతిలో మన కీర్తీ పెంచిన..విశ్వకవి లేడాయెనే...

సొంత లాభం కోరకు దేశం...గోంతు నులిమే ధీరులు
మంచి చెసిన వారి ముంచే...మనుషులెందరో కలరులే
నేటి లోకం అసలు రూపం...నీవు చూసేదెప్పుడో
నీకు తెలిసేదెన్నడో...

కన్నులైనా తెరవని ...ఓ చిన్ని పాపా స్వాగతం
ఊహలింకా తెలియని ...ఓ చిట్టీ పాపా స్వాగతం
ఈ జగానికి స్వాగతం...స్వాగతం...స్వాగతం...

No comments:

Post a Comment