చిత్రం: కొదమ సింహం (1990)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: మనో, చిత్ర
పల్లవి:
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో
పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా.. హత్తుకో.. చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో
చరణం 1:
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో
అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో
లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో
జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో
పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో
వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో
కాచుకో.. కమ్ముకో.. ఖస్సుమన్న కోడెగాడు కాటువేసె కోనలోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో
చరణం 2:
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో
కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో
కౌగిళ్ళే మోసుకొచ్చె తగవుల్లో బిగువుల్లో
సంపంగి ధూపాలేసె గుండెల్లో విందుల్లో
సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో
పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో
అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో
ఆడుకో.. పాడుకో.. అందమంత కొల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లె
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ
హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో
పెదవులాడిన ముద్దుల చప్పట్లో
మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన
పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో
బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ
No comments:
Post a Comment