Sunday, December 9, 2012

నవరాగాలు పాడింది ఏలా

చిత్రం: గాలి మేడలు (1962)
సంగీతం: టి.జి. లింగప్ప
గీతరచయిత: శ్రీరామచంద్
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి:

నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా

హృదయాలు రెండు దరి చేరాయిగానా
మన హృదయాలు రెండు దరి చేరాయిగానా
పలికాయి ఆలాపనా ఆ ఆ ఆ...

నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా

చరణం 1:

ప్రియా నీవేను నాతోడునీడ..నే జీవింతు నీ అడుగుజాడ

మురిపాలు మీర మన సరదాలు తీర.. జతగాను ఉందాము ఈ రీతిగా

నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా

చరణం 2:

ఈవిరజాజి వికసించెనోయి.. నా తొలిపూజ ఫలియించెనోయి

నీదాననోయి నను విడనాడకోయి.. నీ చెంత బ్రతుకెంతో హాయిహాయి

నవరాగాలు పాడింది ఏలా..మది నాట్యాలు ఆడింది చాలా

చరణం 3:

ఇక ఆకాశమే విరిగిపడనీ.. ఒక క్షణమైన విడిపోము రాణీ
ఊ ఊ... ఊ ఊ... ఊ...
ఇక ఆకాశమే విరిగిపడనీ.. ఒక క్షణమైన విడిపోము రాణీ
కలనైనగానీ ఈ ఇలలోనగానీ.. ఎడబాటే దరిరాదు నా మోహినీ

నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా
హృదయాలు రెండు దరి చేరాయిగానా
పలికాయి ఆలాపనా ఆ ఆ ఆ
నవరాగాలు పాడింది ఏలా.. మది నాట్యాలు ఆడింది చాలా

No comments:

Post a Comment